![Kareena Kapoor Says I Am Believe In Equality Not In Feminism - Sakshi](/styles/webp/s3/article_images/2018/05/23/india-arts-cinema-bollywood_8b15bebc-5e5a-11e8-8da7-089610bcbead.jpg.webp?itok=PEQh_N1S)
హీరోయిన్ కరీనా కపూర్
‘నేను స్త్రీవాదిని కాదు. సమానత్వాన్ని నమ్ముతాను. నా దృష్టిలో స్త్రీ, పురుషులు ఇద్దరూ సమానమే’ అంటున్నారు బాలీవుడ్ హీరోయిన్ కరీనా కపూర్. మంగళవారం జరిగిన ‘వీరే ది వెడ్డింగ్’ సినిమా ఆడియో రిలీజ్ వేడుకకు హాజరయిన కరీనాను విలేకరులు ఫెమినిజం గురించి మీ అభిప్రాయమేంటని అడగ్గా ఈ విధంగా స్పందించారు. ‘నేను సమానత్వాన్ని నమ్ముతాను. నన్ను నేను స్త్రీవాదిగా గుర్తించడానికంటే ఓ మహిళగా, అన్నింటికంటే ముఖ్యంగా ఓ మనిషిగా గుర్తింపు పొందటాన్ని ఇష్టపడతాను. అంతేకాక సైఫ్ అలీ ఖాన్ భార్య కరీనా కపూర్‌గా గుర్తింపబడటం నాకు అన్నింటి కంటే గర్వ కారణమ’ని తెలిపారు.
పాత్రల ఎంపికలో మీరు తీసుకునే జాగ్రత్తలేంటి అని ప్రశ్నించగా.. ‘కథలో తన పాత్ర నిడివి చిన్నదా, పెద్దదా అని కాకుండా తన పాత్రకు ప్రాధన్యం ఉందా, లేదా అనేదాన్ని బట్టి ఎంపిక చేసుకుంటానని తెలిపింది. ఇన్ని రోజులు ఎక్కువగా కమర్షియల్ సినిమాల్లో, షారుక్, సల్మాన్ ఖాన్‌లాంటి అందరూ పెద్ద హీరోలతో నటించాను. కానీ ‘వీరే ది వెడ్డింగ్’ చిత్రానికి వచ్చే సరికి ఈ సినిమాలో అన్ని ప్రధాన పాత్రల్లో నలుగురు అమ్మాయిలే నటిస్తుండటం వల్ల ఈ సినిమా పట్ల ఆసక్తి కలిగింది. అందుకే ఈ చిత్రంలో మనసు పెట్టి, పూర్తిగా లీనమై నటించాను. ఈ చిత్రంలో నా పాత్ర పేరు కాళింది. ‘కమిటిమెంట్ ఫోబియా’తో బాధపడే యువతిగా కనిపించనున్నాను. అయితే అందుకు గల కారణాన్ని సినిమా చూసి తెలుసుకోవాల్సిందేన’ని అన్నారు.
బాలీవుడ్‌లో ఎందరో ప్రముఖులతో నటించిన కరీనా ఈ చిత్రంలో మాత్రం ఇప్పుడిప్పుడే గుర్తింపు తెచ్చుకుంటున్న సమ్మిత్ వ్యాస్‌తో తొలిసారిగా జతకట్టింది. ఈ విషయం గురించి కరీనా చెబుతూ.. ‘ఈ చిత్రంలో నేను సమ్మిత్ వ్యాస్‌ను చంద్రుని మీద నుంచి తోసివేస్తాను. నేను ఇంతవరకూ నటించిన ఏ చిత్రంలో కూడా ఇలా చేయలేదు.. దాంతో ఈ సన్నివేశం చేసేటప్పుడు నాకు బాగా నవ్వొచ్చింది. నేను ఇలా చేసినందుకు ప్రేక్షకులు నన్ను క్షమిస్తారనే అనుకుంటున్నాను. కానీ ఈ విషయం మాత్రం చరిత్రలో నిలిచిపోతుంద’న్నారు.
పట్టణంలో నివసించే ఓ నలుగురు అమ్మాయిలు, వారి జీవితాల్లో ఉండే బాధల ఇతివృత్తంగా తెరకెక్కుతున్న ‘వీరే ది వెడ్డింగ్’ చిత్రంలో కరీనాతో పాటు సోనమ్ కపూర్, స్వరా భాస్కర్, శిఖా తల్సానియా నటిస్తున్నారు. శషాంక్ ఘోష్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా 2018, జూన్ 1న విడుదల కానుంది.
Comments
Please login to add a commentAdd a comment