
సాక్షి,న్యూఢిల్లీ: జీఎస్‌టీపై గందరగోళం ఏ స్థాయిలో ఉందనేందుకు స్వయంగా మధ్యప్రదేశ్ బీజేపీ ఎంఎల్‌ఏ వ్యాఖ్యలే అద్దం పడుతున్నాయి. వివాదాస్పద జీఎస్‌టీ వ్యాపారులు, పన్ను నిపుణులే కాదు చివరికి సీఏలకూ అర్థం కావడం లేదని ఎంపీ బీజేపీ ఎంఎల్‌ఏ ఓం ప్రకాష్ దుర్వే అన్నారు. నూతన పన్ను వ్యవస్థను అర్థం చేసుకోవడానికి కొంత సమయం పడుతుందని ఆయన చెప్పుకొచ్చారు.
జీఎస్‌టీ ప్రస్తుతం ఎవరికీ అంతుచిక్కడం లేదని, ఒక్కసారి దీనిపై స్పష్టత వస్తే వ్యాపారులు సహా అందరూ ఊపిరిపీల్చుకుంటారని, పరిశ్రమకు ఇది ఉపయోగపడుతుందని అన్నారు. ఈ ఏడాది జులై నుంచి అమల్లోకి వచ్చిన జీఎస్‌టీపై సర్వత్రా విమర్శలు, అభ్యంతరాలు వెల్లువెత్తిన విషయం తెలిసిందే. మరోవైపు జీఎస్‌టీని ఎలాంటి సన్నద్ధత లేకుండా తొందరపాటుగా ప్రవేశపెట్టారని కాంగ్రెస్ ఉపాథ్యక్షుడు రాహుల్ గాంధీ ఆరోపించారు.
జీఎస్‌టీని అధికారులకు పూర్తి అధికారాలను ఇచ్చేలా, గత లైసెన్స్ రాజ్ వ్యవస్థను గుర్తుకుతెచ్చేలా ప్రవేశపెట్టారని నోట్ల రద్దుకు ఏడాది పూర్తయిన సందర్భంగా రాహుల్ వ్యాఖ్యానించారు.ఇక జీఎస్‌టీని తృణమూల్ అధినేత్రి, బెంగాల్ సీఎం మమతా బెనర్జీ గ్రేట్ సెల్ఫిష్ ట్యాక్స్‌గా అభివర్ణించిన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment