Express Service
-
విద్యార్థులకు ప్రత్యేక ఆఫర్! గతి స్టూడెంట్ ఎక్స్‌ప్రెస్ సర్వీసెస్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: సరుకు రవాణా కంపెనీ గతి తాజాగా విద్యార్థుల కోసం ప్రత్యేకంగా స్టూడెంట్ ఎక్స్‌ప్రెస్ సర్వీసెస్‌ను పరిచయం చేసింది. చదువుల కోసం ఒక చోట నుంచి మరో చోటుకు వెళ్లే విద్యార్థుల కోసం ప్రత్యేక ఆఫర్ అందిస్తోంది. (వంట గ్యాస్ వినియోగదారులకు ఊరట.. తగ్గిన గ్యాస్ సిలిండర్ ధర!) దేశంలో ఎక్కడికైనా 20 కిలోల ప్రత్యేక బాక్స్‌ను రవాణా చేస్తే.. ఉపరితల రవాణా ద్వారా అయితే రూ.825, వాయు మార్గం ద్వారా రూ.2,100 చార్జీ చేస్తారు. దేశవ్యాప్తంగా 735 జిల్లాల్లోని 19,800 పిన్‌కోడ్స్‌లో ఈ సేవలను వినియోగించుకోవచ్చని కంపెనీ తెలిపింది. చదువుల కోసం వెళ్లే విద్యార్థులకు సామాన్ల తరలింపు ఇబ్బందులను లేకుండా చూడటమే తమ ఉద్దేశమని పేర్కొంది. (Jio offer: జియో అన్లిమిటెడ్ డేటా ఆఫర్.. కొత్త కస్టమర్లకు ఉచిత ట్రయల్!) దీంతోపాటు విద్యార్థుల కోసం గతి సంస్థ మరికొన్న సదుపాయాలు కల్పిస్తోంది. సామాన్ల ప్రత్యేక ప్యాకేజింగ్, ఆదివారం, సెలవు రోజుల్లో కూడా పికప్, డెలివరీ, ఉచిత డోర్‌స్టెప్ పికప్, డెలివరీ, వాతావరణ ప్రూఫ్ కంటైనర్ వాహనాల ద్వారా రవాణా, ఆన్లైన్, ఎస్ఎంఎస్ ట్రాకింగ్ సిస్టమ్, ఈమెయిల్ అప్డేట్, 24/7 కస్టమర్ సపోర్ట్ వంటి సేవలు అందిస్తోంది. -
త్వరలో 80 మంది ఆర్టీసీ ఉద్యోగుల తొలగింపు
వాకాడు, న్యూస్‌లైన్ : నెల్లూరు రీజనల్ పరిధిలో ఆర్టీసీ రూ.51 కోట్ల నష్టంతో నడుస్తుండటంతో దాదాపు 80 మంది ఉద్యోగులను తొలగించనున్నట్టు ఆర్ఎం చింతల రవికుమార్ తెలిపారు. స్థానిక ఆర్టీసీ డిపోను సోమవారం ఆయన సందర్శించారు. డిపోలోని వివిధ సెక్షన్లను పరిశీలించారు. ఆర్ఎం మాట్లాడుతూ నష్టాల్లో నడుస్తున్న 36 ఎక్స్‌ప్రెస్ సర్వీస్‌లను త్వరలో రద్దు చేస్తామన్నారు. దీని వల్ల దాదాపు 80 మంది ఉద్యోగాలు కోల్పోయే అవకాశం ఉందన్నారు. నష్టాలను పూడ్చుకునేందుకు ఆర్టీసీ బస్సుల్లోనే ప్రయాణించేలా ప్రతి కూడలిలో ప్రత్యేక సిబ్బందిని నియమించామన్నారు. అలాగే కండక్టర్లు, డ్రైవర్లు ప్రయాణికులతో మర్యాదపూర్వకంగా మాట్లాడి చెయ్యి ఎత్తిన చోట నిలిపి ఎక్కించుకోవాలన్నారు. వాకాడు, సూళ్లూరుపేట, నెల్లూరు-1, ఉదయగిరి డిపోలు నష్టాల్లో ఉన్నాయన్నారు. వాకాడు డిపో పనితీరు బాగాలేదని ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. సగటున కిలోమీటర్‌కు రూ.27 కంటే తక్కువ వచ్చిన సర్వీస్‌లను రద్దు చేయాలని ఆయన డిపో మేనేజర్ రామలింగేశ్వరరావుకు సూచించా రు. ఆయన వెంట సీఐ వెంకటేశ్వరరావు, ఎంసీ నారాయణ,ట్రాఫిక్ సూపర్వైజర్ రాధారెడ్డి, సీఆర్సీ రఘురామయ్య ఉన్నారు.