ఓహెచ్ఎమ్ ఈ లాజిస్టిక్స్‌తో ఫ్రెచ్ కంపెనీ డీల్.. 1000 కార్ల డెలివరీకి రెడీ | Citroen To Supply 1000 Electric Cars to OHM E Logistics Details | Sakshi
Sakshi News home page

ఓహెచ్ఎమ్ ఈ లాజిస్టిక్స్‌తో ఫ్రెచ్ కంపెనీ డీల్.. 1000 కార్ల డెలివరీకి రెడీ

Published Sat, May 18 2024 9:25 PM | Last Updated on Sat, May 18 2024 9:25 PM

Citroen To Supply 1000 Electric Cars to OHM E Logistics Details

భారతీయ మార్కెట్లో అతి తక్కువ కాలంలో అత్యంత ప్రజాదరణ పొందిన ప్రెంచ్ వాహన తయారీ సంస్థ సిట్రోయెన్ ఎప్పటికప్పుడు తన ఉనికిని పెంచుకుంటూనే ఉంది. ఫ్యూయెల్ కార్లతో పాటు, ఎలక్ట్రిక్ కార్లను విక్రయిస్తున్న ఈ కంపెనీ ఇటీవల హైదరాబాద్‌కు చెందిన OHM E లాజిస్టిక్స్‌తో ఒక ఒప్పందం కుదుర్చుకుంది.

OHM E లాజిస్టిక్స్‌తో కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం, సిట్రోయెన్ 1000 ఈ-సీ3 ఎలక్ట్రిక్ వాహనాలను దశల వారీగా సరఫరా చేయనుంది. మొదటి ఫ్లీట్ ఇండక్షన్ దశలో కంపెనీ 120 ఎలక్ట్రిక్ కార్లను డెలివరీ చేయనుంది. ఆ తరువాత 12 నెలల్లో మరో 880 కార్లను డెలివరీ చేస్తుంది.

అక్టోబర్ 2022లో కేవలం 100 ఎలక్ట్రిక్ క్యాబ్‌లతో ప్రారంభమైన ఓహెచ్ఎమ్ ఇప్పుడు విస్తృతమైన సేవలు అందిస్తోంది. సిట్రోయెన్ ఈ-సీ3 ఎలక్ట్రిక్ కార్లు ప్రారంభం నుంచి మంచి అమ్మకాలు పొందుతూ భారతీయ వినియోగదారులను ఆకర్షిస్తున్నాయి. రానున్న రోజుల్లో కంపెనీ మరిన్ని ఉత్పత్తులను దేశీయ విఫణిలో లాంచ్ చేసే అవకాశం ఉందని భావిస్తున్నాము.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement