ఎలక్ట్రిక్ కారు తయారీలో చైనా స్మార్ట్‌ఫోన్ కంపెనీ - సింగిల్ చార్జ్‌తో 265 కిమీ రేంజ్! | Xiaomi Enters Electric Vehicle Market With SU7 | Sakshi
Sakshi News home page

ఎలక్ట్రిక్ కారు తయారీలో చైనా స్మార్ట్‌ఫోన్ కంపెనీ - సింగిల్ చార్జ్‌తో 265 కిమీ రేంజ్!

Published Thu, Nov 16 2023 8:13 PM | Last Updated on Thu, Nov 16 2023 8:23 PM

Xiaomi Enters Electric Vehicle Market With SU7 - Sakshi

గ్లోబల్ మార్కెట్లో ఎలక్ట్రిక్ వాహనాలకు ఆదరణ పెరుగుతున్న తరుణంలో కేవలం ఆటోమొబైల్ తయారీ సంస్థలు మాత్రమే కాకుండా ప్రముఖ చైనా స్మార్ట్‌ఫోన్ దిగ్గజం 'షావోమీ' (Xiaomi) కూడా ఎలక్ట్రిక్ వెహికల్ విభాగంలో అడుగుపెట్టింది. ఇందులో భాగంగానే తన మొట్ట మొదటి ఎలక్ట్రిక్ కారు SU7 ఆవిష్కరించింది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

SU7, SU7 ప్రో, SU7 మాక్స్ అనే మూడు వేరియంట్లలో విడుదలకానున్న కొత్త షావోమీ SU7 ఎలక్ట్రిక్ కారు రియర్-వీల్ డ్రైవ్ (RWD), ఆల్-వీల్ డ్రైవ్ (AWD) అనే రెండు పవర్‌ట్రెయిన్ ఎంపికలతో లభించనుంది.

రియర్-వీల్ డ్రైవ్ పవర్‌ట్రెయిన్ కలిగిన షావోమీ ఎలక్ట్రిక్ కారు 295 Bhp పవర్ అందించే ఎలక్ట్రిక్ మోటారు పొందుతుంది. అయితే ఆల్-వీల్ డ్రైవ్ మోడల్ 663 Bhp పవర్ అందిస్తుంది. ఇందులో రెండు ఎలక్ట్రిక్ మోటార్లు అందుబాటులో ఉంటాయి.

ఇదీ చదవండి: లాంచ్‌కు ముందే రూ.10 కోట్ల కారు కొన్న చెన్నై వాసి - ఫోటోలు వైరల్

షావోమీ ఎలక్ట్రిక్ కారు LFP బ్యాటరీ ప్యాక్‌లను కలిగి ఉంటడం వల్ల మంచి రేంజ్ అందిస్తాయి. బేస్ మోడల్స్ ఒక ఫుల్ చార్జ్‌తో 210 కిమీ/గం, హై ఎండ్ వేరియంట్స్ 265 కిమీ/గం రేంజ్ అందిస్తాయి. బేస్ మోడల్స్ బరువు 1980 కేజీలు కాగా, టాప్ ఎండ్ మోడల్స్ 2205 కేజీల వరకు ఉంటుంది.

కంపెనీ ఈ ఎలక్ట్రిక్ కారు ఉత్పత్తిని 2023 డిసెంబర్ నుంచి ప్రారంభించే అవకాశం ఉంటుంది. డెలివరీలు 2024 ఫిబ్రవరి నుంచి ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే సంస్థ బీజింగ్ ఫ్యాక్టరీలో ట్రయల్ ప్రొడక్షన్ కూడా ప్రారంభించింది. ఈ ఎలక్ట్రిక్ కారు డిజైన్, ఇతర ఫీచర్స్, ధరలు వంటి మరిన్ని అధికారిక వివరాలు త్వరలోనే వెల్లడవుతాయి. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement