దేశంలో ప్రముఖ ఆటోమొబైల్ దిగ్గజం మహీంద్రా అండ్ మహీంద్రా వాహన దారులకు భారీ షాకిచ్చింది. మహీంద్రా సంస్థకు చెందిన ఎక్స్‌యూవీ 700 కారు ధరల్ని భారీగా పెంచుతున్నట్లు ప్రకటించింది. దీంతో ఎక్స్ యూవీ కార్ ధర రూ.13.18 లక్షల నుండి రూ.24.58 లక్షల వరకు పెరిగింది.
దేశంలో స్టీల్,అల్యూమినియంతో పాటు ఇతర ముడి ఉత్పత్తుల ధరలు పెరగడం వల్లే మహీంద్రా సంస్థ ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇక పెరిగిన ధరలు ఏప్రిల్ 14 నుండి అమల్లోకి వచ్చాయి.
హాట్ కేకుల్లా అమ్మకాలు
మార్చి 2022లో 6,040 కంటే ఎక్కువ ఎక్స్‌యూవీ 700లు అమ్ముడయ్యాయి. ఈ సంఖ్య మార్చి నెలలో అమ్మిన మొత్తం 4,138 యూనిట్ల కంటే 46 శాతం పెరిగింది.
వెహికల్స్ ధరలు పెరుగుతూనే ఉన్నాయ్!
మహీంద్రా ఎక్స్ యూవీ 700 పెట్రోల్ వెర్షన్ ధరలు రూ.71,000, డీజిల్ వెర్షన్ ధర రూ.78,000 వరకు పెరిగాయి. తాజా ధరల జాబితాలో మహీంద్రా ఎక్స్‌యూవీ700 ఎంటీ పెట్రోల్ ఎంఎక్స్ ట్రిమ్ ధర రూ.12.96 లక్షల నుండి రూ. 13.18 లక్షలకు (ఎక్స్-షోరూమ్) పెరిగింది.
ఈ ఏడాది జనవరిలో రూ.18.63 లక్షలు ఉన్న ఎంటీ పెట్రోల్ ఏఎక్స్ 7 మోడల్ ధర ఇప్పుడు రూ.19.21 లక్షలు పెరిగింది. మహీంద్రా ఎక్స్‌యూవీ700 పెట్రోల్ ఏటీ ఏఎక్స్ 3ట్రిమ్ ధర రూ.16.57 లక్షల నుండి రూ.16.84 లక్షల వరకు పెరిగింది. అయితే టాప్ ఎండ్ ఏఎక్స్ 7ఎల్ ధర రూ.22.04 లక్షల నుండి రూ.22.75 లక్షల వరకు పెంచుతూ ఈ దేశీయ ఆటోమొబైల్ సంస్థ నిర్ణయం తీసుకుంది.
అన్ని మహీంద్రా ఎక్స్‌యూవీ 700 డీజిల్ మోడల్ ధర పెరుగుదల తర్వాత ఎంటీఎంక్స్ ట్రిమ్ ధర రూ.17.58 లక్షల వరకు పెరగ్గా..ఈ కారు ధర జనవరిలో రూ.17.29 వద్ద ఉంది. ఏఎక్స్7ఎల్ ధర రూ.21.01 లక్షల నుండి రూ.21.66 లక్షలకు, మహీంద్రా ఎక్స్‌యూవీ 700 ఏఎక్స్3 డీజిల్ ఏటీ మోడల్ కాగా,ఏఎక్స్ 7ఎల్ ఏడబ్ల్యూడీ ధర రూ.24.50 లక్షలుగా ఉంది. మహీంద్రా ఎక్స్‌యూవీ700తో పాటు థార్,బొలెరో,స్కార్పియో,ఎక్స్‌యూవీ 300 మోడళ్ల ధరల్ని పెంచింది.
Comments
Please login to add a commentAdd a comment