మీరు కొత్తగా ఎలక్ట్రిక్ కారు కొనాలని చూస్తున్నారా? అయితే, మీకు శుభవార్త. మహీంద్రా అండ్ మహీంద్రా 2020 ఆటో షో ఎక్స్‌పోలో ప్రదర్శించిన ఈకెయువీ 100 ఎలక్ట్రిక్ కారుని ఈ ఏడాదిలో లాంచ్ చేయలని చూస్తున్నట్లు సమాచారం. అయితే, గత ఆటో షో ఎక్స్‌పోలో ఈకేయూవీ100ని ప్రదర్శించిన సమయంలో పేర్కొన్న ధరకు లాంచ్ చేయడానికి కంపెనీ ఒత్తిడిలో ఉందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. ఏప్రిల్ 2020 ఆటో షో ఎక్స్‌పోలో ఫేమ్ ప్రోత్సాహకాలతో కలిపి ఈకేయూవీని రూ.8.25 లక్షల(ఎక్స్-షోరూమ్, ఢిల్లీ) ధరకు లాంచ్ చేయనున్నట్లు తెలిపింది.
ఎలక్ట్రిక్ ఎక్స్‌యూవీ 300ని 2023 ప్రారంభంలో తీసుకొని రావడానికి ప్లాన్ చేస్తుంది. అయితే, ఈకేయూవీ100 ఎలక్ట్రిక్ కారు టెస్టింగ్ చివరి దశలో ఉందని, 2022 చివరి నాటికి మార్కెట్లోకి వస్తుందని మార్కెట్ వర్గాల సమాచారం. మహీంద్రా గతంలో విడుదల చేసిన ఈ2ఓ ఎలక్ట్రిక్ కారు పెద్దగా విజయం సాధించకపోవడంతో ఈకేయూవీ100పై ఎక్కువ మీద అంచనాలు పెరిగాయి. కనీసం 250 కిలోమీటర్ల గరిష్ట రేంజ్, రూ.10 లక్షల లోపు అత్యంత సరసమైన ఎలక్ట్రిక్ కారుగా తీసుకొని రావాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలుస్తుంది. మహీంద్రా ఎలక్ట్రిక్ ఆటో ట్రియో, ఈఅల్ఫా వంటి ఉత్పత్తులతో ఇప్పుడిప్పుడే తన మార్కెట్ విస్తరిస్తుంది.
వ్యక్తిగత విభాగంలో ఎలక్ట్రిక్ కార్ల పోర్ట్ఫోలియోతో ప్రత్యర్థి టాటా మోటార్స్ ఇటీవలి కాలంలో 70% కంటే ఎక్కువ మార్కెట్ వాటాతో ముందుకు సాగింది. అంతకుముందు మార్చి 2021లో మహీంద్రా అండ్ మహీంద్రా లిమిటెడ్ మహీంద్రా ఎలక్ట్రిక్ మొబిలిటీ లిమిటెడ్(ఎంఈఎంఎల్) అనే అనుబంధ సంస్థను కంపెనీలోకి ఏకీకృతం చేసింది. ఈ రంగంలో కంపెనీ 3000 కోట్ల రూపాయలను మూలధన పెట్టుబడిగా పెట్టనున్నట్లు ప్రకటించింది.
(చదవండి: ఫ్లిప్‌కార్ట్ బంపర్ ఆఫర్.. రూ.30 వేల యాపిల్ ఐఫోన్ రూ.15 వేలకే..!)
Comments
Please login to add a commentAdd a comment