
న్యూఢిల్లీ: కెనడాలోని తమ అనుబంధ సంస్థ రెసాన్ ఏరోస్పేస్ కార్పొరేషన్ మూతబడిందని మహీంద్రా అండ్ మహీంద్రా (ఎంఅండ్‌ఎం) వెల్లడించింది. రెసాన్ స్వచ్ఛందంగా మూసివేతకు దరఖాస్తు చేసుకోగా కార్పొరేషన్స్ కెనడా నుంచి అనుమతులు లభించినట్లు తెలిపింది.
కంపెనీ లిక్విడేషన్‌తో అందులో తమకున్న 11.18 శాతం వాటా ప్రకారం 4.7 మిలియన్ కెనడియన్ డాలర్లు (సుమారు రూ. 28.7 కోట్లు) లభించగలవని ఎంఅండ్‌ఎం తెలిపింది.