Mahindra XUV300 TurboSport Launched In India: Check Price Details And Features - Sakshi
Sakshi News home page

Mahindra XUV300 TurboSport: ధర, ఫీచర్లు ఎలా ఉన్నాయంటే..!

Published Sat, Oct 8 2022 6:28 PM | Last Updated on Sat, Oct 8 2022 6:58 PM

Mahindra XUV300 TurboSport Launched Price and features details here - Sakshi

సాక్షి,ముంబై:  మహీంద్రా  కొత్త టర్బో  స్పోర్ట్‌ ఎక్స్‌యూవీ 300ని లాంచ్‌ చేసింది.  సాధారణ మోడల్‌తో విభిన్నంగా ఉండేలా స్పోర్టీ ఎక్స్‌టీరియర్ ఎలిమెంట్ష్‌తో మూడు వేరియంట్లలో లభిస్తున్న ఈ ఎక్స్‌యూవీ ప్రారంభ ధర రూ.10.35 లక్షలు (ఎక్స్-షోరూమ్). లభిస్తుంది.

W6, W8  W8(O) వేరియంట్లలో  బ్లేజింగ్ బ్రాంజ్ విత్ బ్లాక్ రూఫ్ టాప్, నాపోలీ బ్లాక్ విత్ వైట్ రూఫ్ టాప్, పెర్ల్ వైట్ విత్ బ్లాక్ రూఫ్ టాప్ , బ్లేజింగ్ బ్రాంజ్ మోనోటోన్ కలర్స్‌లో ఇది లభ్యం. ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ ఆప్షన్‌ ఇవ్వలేదు. కేవలం 6 స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌తో మాత్రమే టర్బో స్పోర్ట్‌ ఎక్స్‌యూవీ 300 లభిస్తుంది.

ఇంజీన్‌, ఫీచర్లు
1.2-లీటర్ mStallion TGDi టర్బో పెట్రోల్ ఇంజన్‌ ఇందులో అందించింది. ఈ ఇంజీన్‌  5000 RPM వద్ద 130 PS,  1500-3750 RPM వద్ద 230 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.  5 సెకన్లలో 0-60 km/hr వేగాన్ని అందుకుంటుందని  కంపెనీ వెల్లడించింది. పియానో ​​బ్లాక్ ఫినిషింగ్‌లో రెడ్ గ్రిల్ ఇన్సర్ట్‌లు, ఆల్-బ్లాక్ ORVMలు, ఆల్-బ్లాక్ ఇంటీరియర్స్, లెథెరెట్ సీట్లు, క్రోమ్-ఫినిష్ పెడల్స్ , డ్యూయల్-టోన్ ఎక్స్‌టీరియర్స్ వంటి స్పోర్టీ డిజైన్ యాక్సెంట్స్‌తో వచ్చింది. 

డ్యూయల్ జోన్ ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, రెయిన్ సెన్సింగ్ వైపర్‌లు & ఆటో హెడ్‌ల్యాంప్‌లు, అడాప్టివ్ గైడ్‌లైన్స్‌తో వెనుక పార్కింగ్ కెమెరా, 17.78 సెం.మీ ఇన్ఫోటైన్‌మెంట్, ఆండ్రాయిడ్ ఆటో & ఆపిల్ కార్‌ప్లే, బ్లూసెన్స్ కనెక్ట్, ఎలక్ట్రికల్‌గా అడ్జస్టబుల్అండ్‌ ఫోల్డబుల్ ORVMలు, మైక్రో హైబ్రిడ్ టెక్నాలజీ, స్టీరింగ్  లాంటి ఫీచర్లు దీని  సొంతం.  సేఫ్టీ ఫీచర్ల విషయానికి  వస్తే  4 డిస్క్ బ్రేక్‌లు, ఫ్రంట్ పార్కింగ్ సెన్సార్లు, 6 ఎయిర్‌బ్యాగ్‌లు, ESP విత్ హిల్ స్టార్ట్ అసిస్ట్, ABS, ప్యాసింజర్ ఎయిర్‌బ్యాగ్ డీయాక్టివేషన్ స్విచ్, ISOFIX సీట్లు, కార్నర్ బ్రేకింగ్ కంట్రోల్ మొదలైనవి ఉన్నాయి.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement