
సాక్షి, న్యూఢిల్లీ : పారిశ్రామిక వేత్త ,మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్ర మరో ఆసక్తికరమైన విషయాన్ని ట్విటర్ లో షేర్ చేశారు. ఇప్పుడా పోస్ట్ ట్విటర్‌లో హల్‌చల్ చేస్తోంది. చెట్టుకు గోలుసుతో కట్టేసి ఉన్న ఓ బ్లాక్ మహీంద్ర స్కార్పియో ఫోటోను ఆయన పోస్ట్ చేశారు. ‘లాక్‌డౌన్ సమయంలో నేను కూడా ఇలానే ఉన్నాను’ అనే అర్థంతో వచ్చే ట్యాగ్‌లైన్‌ను దానికి జత చేశారు.
‘కారుకు అత్యాధునికమైన లాకింగ్ సిస్టమ్ ఉన్నప్పటికీ.. గొలుసుతో కట్టేయడమనేది యజమాని స్వాధీనతను చూపుతుంది. నేను కూడా లాక్‌డౌన్ సమయంలో కరోనా అనే గొలుసుతో బంధీ అయ్యాను. ఈ వారాంతంలో దాన్ని చేధించి బయటకు వస్తానని అశిస్తున్నా(మాస్కుతో )’ అని పోస్ట్ చేశారు. ఈ పోస్ట్‌కు నెటిజన్ల నుంచి లైక్‌లు, కాంమెంట్లు వస్తున్నాయి. మనలోని చెడు ఆలోచనలను కూడా గొలుసుతో బంధించాలని ఒకరు, యజమానికి గొలుసుపైనే ఎక్కువ నమ్మకం ఉన్నట్టుందని మరొకరు కామెంట్ చేశారు. (వైరల్ : ట్రంప్‌దే విజయం.. ఆనంద్ మహీంద్రా ట్వీట్)
Not exactly a high tech locking solution but at least it shows the owner’s possessiveness! To me, this pic perfectly describes how I feel under lockdown. This weekend I’m going to try breaking that chain..(with my mask on!) pic.twitter.com/CbW4FUml1a
— anand mahindra (@anandmahindra) November 6, 2020
Comments
Please login to add a commentAdd a comment