కర్నూలు(కోవెలకుంట్ల) : గొర్రెల మందపైకి స్కార్పియో వాహనం దూసుకెళ్లటంతో 92 గైలు మృతి చెందాయి. ఈ సంఘటనలో కర్నూలు జిల్లాలోని కోవెలకుంట్ల- ముదిగేడు రోడ్డులో బుధవారం అర్ధరాత్రి జరిగింది. వివరాలు... అనంతపురం జిల్లా యాడికి మండలం గుడిపాడు గ్రామానికి చెందిన గొర్రెల పెంపకందారులు తమ 800 గొర్రెలను మేపుకునేందుకు గోస్పాడుకు తోలుకెళ్తున్నారు.
కోవెలకుంట్ల వైపు నుంచి వస్తున్న స్కార్పియో వాహనం మందను గమనించకుండా వేగంగా దూసుకెళ్లడంతో 92 గొర్రెలు మృతి చెందాయి. మరో 15 గొర్రెలు గాయపడ్డాయి. చనిపోయిన గొర్రెల విలువ సుమారు రూ. 5.50 లక్షల వరకు ఉంటుందని ఎస్‌ఐ తెలిపారు.