అకస్మాత్తుగా మంటలు చెలరేగి ఓ స్కార్పియో కారు దగ్ధమైంది.
వంగుటూరు(పశ్చిమగోదావరి జిల్లా): అకస్మాత్తుగా మంటలు చెలరేగి ఓ స్కార్పియో కారు దగ్ధమైంది. ఈ సంఘటన వంగుటూరు మండలం నాచుగుంటలో మంగళవారం చోటుచేసుకుంది. తూర్పుగోదావరి జిల్లా అనపర్తికి చెందిన ఓ కుటుంబం నెల్లూరుకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. కారులో నుంచి పొగలు రావడం గమనించి అందులో ఉన్నవారు కిందగి దిగారు.
అనంతరం కొద్దిసేపటికే మంటలు చెలరేగి కారు పూర్తిగా దగ్ధమైంది. ప్రమాద సమయంలో కారులో ఐదుగురు ఉన్నారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలను అదుపు చేస్తున్నారు. ప్రమాదానికి షార్ట్ సర్క్యూటే కారణమై ఉండవచ్చునని అనుమానిస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.