హైబ్రిడ్ టెక్నాలజీతో..మహీంద్రా స్కార్పియో | Mahindra Scorpio Gets Mild Hybrid Technology | Sakshi
Sakshi News home page

హైబ్రిడ్ టెక్నాలజీతో..మహీంద్రా స్కార్పియో

Published Thu, Jul 21 2016 1:17 AM | Last Updated on Mon, Sep 4 2017 5:29 AM

హైబ్రిడ్ టెక్నాలజీతో..మహీంద్రా స్కార్పియో

హైబ్రిడ్ టెక్నాలజీతో..మహీంద్రా స్కార్పియో

ధర రూ. 14 లక్షలు
న్యూఢిల్లీ: దేశీ దిగ్గజ వాహన కంపెనీ ‘మహీంద్రా అండ్ మహీంద్రా’ (ఎం అండ్ ఎం) తాజాగా తన ప్రముఖ స్కార్పియో మోడల్‌లో కొత్త మైల్డ్ హైబ్రిడ్ వెర్షన్‌ను మార్కెట్‌లోకి విడుదల చేసింది. దీని ధర రూ.9.74-14.01 లక్షల శ్రేణిలో (ఎక్స్‌షోరూమ్ ముంబై) ఉంది. కంపెనీ ఇందులో తొలిసారిగా ‘ఇన్‌టెలి-హైబ్రిడ్’ అనే హైబ్రిడ్ టెక్నాలజీని పొందుపరిచింది. దీని వల్ల ఇంధన వినియోగం 7% మేర తగ్గుతుందని కంపెనీ పేర్కొంది. 2.2 లీటర్ ఎం-హక్ ఇంజిన్ కలిగిన స్కార్పియో ఎస్4, ఎస్4 ప్లస్, ఎస్4 ప్లస్ 4డబ్ల్యూడీ, ఎస్6 ప్లస్, ఎస్8, ఎస్10-2డబ్ల్యూడీ (మాన్యువల్ ట్రాన్స్‌మిషన్), ఎస్10-4డబ్ల్యూడీ (మాన్యువల్ ట్రాన్స్‌మిషన్) వేరియంట్లలో ఈ హైబ్రిడ్ టెక్నాలజీ అందుబాటులో ఉంటుంది.  వాయిస్ మేసేజింగ్ సిస్టమ్ ఉన్న తొలి దేశీ ఎస్‌యూవీ ఇది.  6-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో కూడిన సీఆర్‌డీఈ ఇంజిన్‌ను తొలిసారిగా దీనిలోనే ఉపయోగించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement