నల్లచెరువు మండలం దేవిరెడ్డిపల్లి వద్ద గురువారం తెల్లవారుజామున ఓ స్కార్పియో అదుపుతప్పి చెట్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు మృతిచెందగా.. మరో ముగ్గురు గాయపడ్డారు. గాయపడ్డవారిని కదిరి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. తిరుమల శ్రీవారిని దర్శించుకుని వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. చనిపోయిన వ్యక్తులు రవి(50), మురళి(56), అనిల్(30) అంతా హిందూపూర్‌కు చెందిన వారిగా గుర్తించారు. రవి అక్కడిక్కడే మృతిచెందగా, మిగతా వారు ఆసుపత్రికి తరలిస్తుండగా మృతిచెందారు.