జవాన్ దుర్మరణం
జవాన్ దుర్మరణం
Published Fri, Jun 9 2017 10:50 PM | Last Updated on Thu, Aug 30 2018 4:10 PM
- స్కార్పియో వాహనం బోల్తా
- హుళేబీడు గ్రామం వద్ద ఘటన
హుళేబీడు(ఆలూరు రూరల్) : ఆలూరు మండలం హుళేబీడు గ్రామశివారులోని మలుపు వద్ద శుక్రవారం రాత్రి చోటుచేసుకున్న రోడ్డు ప్రమాదంలో బీఎస్‌ఎఫ్ జవాను మృతి చెందాడు. స్వయంగా వాహనం నడుపుతున్న అతడు మలుపు వద్ద నియంత్రించుకోలేకపోవడంతో బోల్తా పడింది. మృతుడు గుంతకల్‌కు చెందిన సి.రామ్‌బాబుగా తెలిసింది. ఇతడు డ్రైవింగ్ చేస్తూ ఆదోనికి వెళ్తుండగా ప్రమాదం జరిగింది. రోడ్డుపై మలుపు వద్ద వాహనాన్ని(స్కార్పియో: ఏపీ 21 ఏటీ296) నియంత్రించుకోలేకపోవడమే ప్రమాదానికి కారణంగా తెలుస్తోంది.
ఆ మార్గంలో వెళ్తున్న వాహనదారులు స్కార్పియో వాహనంలో ఇరుక్కుపోయిన రామ్‌బాబు మృతదేహాన్ని బయటకు తీశారు. ఆలూరు పోలీసులకు సమాచారం అందించారు. ఈ మేరకు పోలీసులు అక్కడికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించారు. మృతుని జేబులో ఉన్న ఆధార్, ఐడెంటిటీ కార్డు ఆధారంగా వివరాలు గుర్తించారు. సి.రాంబాబు, సన్నాఫ్ ప్రకాష్ పేర్లున్నాయి. గుంతకల్‌కు చెందిన వ్యక్తిగా వివరాలు అందులో నమోదయ్యాయి. మరొక కార్డులో సి.రామ్‌బాబు, బీఎస్‌ఎఫ్ జవాన్ అనే ఐడెంటిటీ కార్డు కూడా లభ్యమైంది. వాహనంలో ఎందరు ప్రయాణిస్తున్నారు, ఆ వాహనం ఎక్కడికి వెళ్తుందన్న వివరాలపై దర్యాప్తు చేస్తున్నట్లు ఆలూరు ఎస్‌ఐ ధనుంజయ తెలిపారు.
Advertisement