తేలు కాటుకు గురైన ‘ఆశ్రమ’ విద్యార్థి
Published Thu, Jul 28 2016 12:58 AM | Last Updated on Sat, Sep 15 2018 7:55 PM
కొత్తగూడ: తేలు కాటుకు గురై ఆశ్రమ పాఠశాల విద్యార్థి చికిత్స పొందుతూ ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. వివరాలిలా ఉన్నాయి.. మండలంలోని కామారం ఆశ్రమ పాఠశాలలో 5వ తరగతి చదువుతున్న ఈక రవికుమార్ రెండు రోజుల క్రితం సాయంత్రం భోజనం చేసి ఇంటికి వెళ్లే క్రమంలో తేలు కుట్టింది.
పాఠశాల మొత్తంలో 37 మంది స్థానిక గ్రామ విద్యార్థులే చదువుతుండటంతో ఉదయం, సాయంత్రం భోజనం పెట్టిన తరువాత విద్యార్థులను ఇంటికి పంపిస్తున్నారు. కాగా ఇంటికి వెళ్లే సమయంలో తేలు కాటు వేయడంతో విద్యార్థి పరిస్థితి విషమంగా మారింది. ఉపాద్యాయులు వెంటనే హన్మకొండలోని అమృత ఆసుపత్రిలో చికిత్స చేయిస్తున్నారు. ఈవిషయమై ఏటీడబ్ల్యూఓ మోహన్‌రావును వివరణ కోరగా తేలు కుట్టింది నిజమేనని చెప్పారు. విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి చికిత్స చేయిస్తున్నట్లు తెలిపారు. డిప్యూటీ వార్డెన్‌కు ఐటీడీఏ డీడీ పోచం మెమో జారీ చేసినట్లు తెలిసింది.
Advertisement
Advertisement