
లక్నో : ఉత్తరప్రదేశ్‌లో శుక్రవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ప్రతాప్ గఢ్ జిల్లాలోని వాజిద్‌పూర్‌లో ఉదయం 5.35 గంటల సమయంలో స్కార్పియో వాహనం, ట్రక్కు ఢీకొన్నాయి. ఈ ఘటనలో 9 మంది అక్కడికక్కడే మృతి చెందారు. వీరంతా ఒకే కుటుంబానికి చెందిన వారు కావడం దురదృష్టకరం. మృతుల్లో అయిదుగురు పురుషులు, ఇద్దరు మహిళలు, ఇద్దరు చిన్నారులు ఉన్నారు. ప్రమాదంలో గాయపడిన ఒకరిని చికిత్స నిమిత్తం లక్నోలోని ఆస్పత్రికి తరలించారు. రాజస్థాన్ నుంచి బీహార్‌లోని భోజ్‌పూర్ వెళ్తుండగా ప్రమాదం చోటుచేసుకున్నట్లు ప్రతాప్‌గఢ్ ఎస్పీ అభిషేక్ సింగ్ తెలిపారు. స్కార్పియో వాహనం పూర్తిగా ధ్వంసం అవ్వడంతో మృతదేహాలను వెలికితీయడం పోలీసులకు కష్టతరంగా మారింది. గ్యాస్ కట్టర్లను ఉపయోగించి మృతదేహాలను బయటకు తీశారు. కాగా చనిపోయిన వారికి సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉందని ఎస్పీ పేర్కొన్నారు. (ఘోర ప్రమాదం: నాడు తల్లి.. నేడు కూతురు..)
Comments
Please login to add a commentAdd a comment