శశి థరూర్‌పై కోర్టు ఆగ్రహం, జరిమానా | Tharoor fined Rs 5000 by Delhi court  | Sakshi
Sakshi News home page

శశి థరూర్‌పై కోర్టు ఆగ్రహం, జరిమానా

Published Sat, Feb 15 2020 3:53 PM | Last Updated on Sat, Feb 15 2020 4:02 PM

Tharoor fined Rs 5000 by Delhi court  - Sakshi

కాంగ్రెస్‌ సీనియర్‌ నేత శశి థరూర్‌

సాక్షి, న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్రమోదీని ఉద్దేశించి పరోక్షంగా చేసిన అనుచిత వ్యాఖ్యల కేసులో కాంగ్రెస్‌ సీనియర్‌ నేత శశి థరూర్‌కు ఢిల్లీ కోర్టు జరిమానా విధించింది. ఈ వ్యాఖ్యలపై  బీజేపీ నాయకుడు రాజీవ్ బబ్బర్ దాఖలు చేసిన దాఖలైన పరువు నష్టం కేసులో పదేపదే హాజరుకాకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేసిన కోర్టు ఆయనకు రూ. 5వేల జరిమానా విధించింది. అనంతరం తదుపరి విచారణను మార్చి 4వ తేదీకి వాయిదా వేసింది. ఈ విచారణకు హాజరుకావాలని అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ విశాల్ పహుజా  ఆయనను ఆదేశించారు. 

కాగా  2018లో బెంగళూరు సాహిత్య ఉత్సవంలో శశి థరూర్‌ ఈ వివాదాస్పద వాఖ్యలు చేశారు. ప్రధాని మోదీని శివలింగంపై తేలులా ఆరెస్సెస్‌ వారు భావిస్తుంటారు. ఆ తేలును చేత్తో తీసేయలేం. చెప్పుతో కొట్టలేం అనుకుంటుంటారు. ఈ విషయం ఆరెస్సెస్‌లోని ఒక వ్యక్తి ఓ జర్నలిస్ట్‌కు చెప్పారంటూ చేసిన  వ్యాఖ్యలు పెద్ద దుమారాన్ని  రేపిన సంగతి తెలిసిందే.

చదవండి :  మోదీ.. శివలింగంపై తేలు!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement