
సాక్షి, న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీని శివలింగంపై కూర్చున్న తేలుతో పోల్చడంపై దాఖలైన పరువునష్టం కేసులో కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్‌కి ఊరట లభించింది. ఢిల్లీ కోర్టు మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ సమర్ విశాల్ ఆయనకు బెయిల్ మంజూరు చేశారు. వ్యక్తిగత పూచీకత్తు రూ.20 వేలు చెల్లించాలని మెజిస్ట్రేట్ ఆదేశించారు. గతేడాది అక్టోబర్‌లో బెంగళూరు వేదికగా జరిగిన లిటరేచర్ ఫెస్టివల్‌లో శశిథరూర్ మాట్లాడుతూ.. బీజేపీ మాతృసంస్థ ఆర్ఎస్ఎస్ మాటను మోదీ వినే పరిస్థితుల్లో లేరని అర్ధం వచ్చేలా శశిథరూర్ విమర్శలు చేశారు. ‘మోదీ శివలింగంపై కూర్చున్న తేలు వంటివారు. చేత్తో తొలగించలేరు, చెప్పుతోనూ కొట్టలేరు’ అంటూ ఆయన పేర్కొన్నారు. ఈమేరకు బీజేపీ నేత రాజీవ్ బబ్బార్ ఆయనపై పరువునష్టం కేసును దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇవాళ విచారణకు హాజరైన శశిథరూర్.. తనకు బెయిల్ మంజూరు చేయాలంటూ పిటిషన్ దాఖలు చేశారు. ఆయన విజ్ఞప్తిని పరిశీలించిన కోర్టు బెయిల్ మంజూరు చేసింది.
Comments
Please login to add a commentAdd a comment