సాక్షి, అమరావతి: శ్రీశుభకృత్ నామ సంవత్సరాది సందర్భంగా రాష్ట్ర ప్రజలకు, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. శుభకృత్ నామ సంవత్సరంలో రాష్ట్ర ప్రజలకు అన్నీ శుభాలు కలగాలని, సమృద్ధిగా వానలు కురవాలని; పంటలు బాగా పండాలని, రైతులకు మేలు జరగాలని, సకల వృత్తుల వారు ఆనందంగా ఉండాలన్నారు.
చదవండి: ప్రభుత్వ ఆస్పత్రుల రూపురేఖలు మారుతున్నాయి: సీఎం జగన్
రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, పల్లెల్లో, పట్టణాల్లో ప్రతి ఇల్లూ కళకళలాడాలని, మన సంస్కృతీ సంప్రదాయాలు కలకాలం వర్ధిల్లాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు. షడ్రుచుల ఉగాదితో ప్రారంభమయ్యే శుభకృత్ సంవత్సరంలో ఇంటింటా ఆయురారోగ్యాలు, సిరిసంపదలు, ఆనందాలు నిండాలని అభిలషించారు. ప్రతి ఒక్కరూ ఉగాది పండుగను సంప్రదాయబద్ధంగా జరుపుకోవాలని సీఎం ఆకాంక్షించారు.
రాష్ట్ర ప్రజలకు, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ శ్రీ శుభకృత్ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఈ శుభకృత్ నామ సంవత్సరంలో అందరికీ మంచి జరగాలని, ప్రతి ఇల్లు ఆయురారోగ్యాలు, సుఖ సంతోషాలతో నిండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా.
— YS Jagan Mohan Reddy (@ysjagan) April 2, 2022
Comments
Please login to add a commentAdd a comment