శ్రీశైలం దసరా ఉత్సవాలు: సీఎం జగన్‌ను ఆహ్వానించిన కొట్టు సత్యనారాయణ | Kottu Satyanarayana Invites CM Jagan For Srisailam Dussehra Celebrations | Sakshi
Sakshi News home page

శ్రీశైలం దసరా ఉత్సవాలు: సీఎం జగన్‌ను ఆహ్వానించిన మంత్రి కొట్టు సత్యనారాయణ

Sep 16 2022 12:27 PM | Updated on Sep 16 2022 12:43 PM

Kottu Satyanarayana Invites CM Jagan For Srisailam Dussehra Celebrations - Sakshi

సాక్షి, అమరావతి: దసరా నవరాత్రుల సందర్భంగా శ్రీశైలం శ్రీ భ్రమరాంబ మల్లిఖార్జునస్వామి దసరా నవరాత్రుల ఉత్సవాల జరుగనున్నాయి. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని డిప్యూటీ సీఎం, దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ ఉత్సవాలకు ఆహ్వానించారు.

ఈ మేరకు శుక్రవారం సీఎం జగన్‌ను మంత్రి కొట్టు సత్యనారాయణ, ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి, దేవాదాయశాఖ కమిషనర్‌ ఎం హరిజవహర్‌లాల్, శ్రీశైలం దేవస్ధానం ఈవో లవన్న, దేవస్ధానం ఛైర్మన్‌ రెడ్డివారి చక్రపాణిరెడ్డి, సభ్యులు కలిశారు. ఈ సందర్బంగా సీఎం వైఎస్‌ జగన్‌కు వేద పండితులు వేద ఆశీర్వచనంతో పాటు శేషవస్త్రాలు, ప్రసాదాలు అందజేశారు. అనంతరం.. సీఎం జగన్‌ను శ్రీశైలం శ్రీభ్రమరాంబ మల్లిఖార్జునస్వామి దసరా ఉత్సవాలకు హాజరు కావాల్సిందిగా దేవాదాయశాఖ మంత్రి, దేవాదాయశాఖ కమిషనర్, శ్రీశైలం దేవస్ధానం కార్యనిర్వహణాధికారి కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement