
శ్రీగిరిపై మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు నేత్రానందభరితంగా సాగుతున్నాయి. మహాశివరాత్రి బ్రహ్మోత్సవ క్రతువులో భాగంగా ఐదవ రోజు మంగళవారం నీలకంఠుడు భ్రమరాంబా సమేతుడై దశకంఠుడి భుజస్కంధాలపై ఊరేగాడు

ఆనవాయితీ ప్రకారం కాణిపాకం శ్రీవరసిద్ధి వినాయక స్వామి దేవస్థానం తరపున భ్రమరాంబా మల్లికార్జున స్వామిఅమ్మవార్లకు పట్టువస్త్రాలు సమర్పించారు.

అశేష భక్తజనం మధ్య సాగిన గ్రామోత్సవంలో సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి






































