విద్యుత్ కాంతులతో శ్రీశైల ఆలయ ప్రధాన గోపురం
శ్రీశైలం టెంపుల్: శ్రీశైల మహా క్షేత్రంలో కార్తీక మాసోత్సవాలు ప్రారంభమయ్యాయి. శుక్రవారం ప్రారంభమైన ఈ ఉత్సవాలు డిసెంబర్ 4వ తేదీ వరకు జరుగుతాయి. కార్తీక మాసం ప్రారంభాన్ని పురస్కరించుకుని శుక్రవారం వేకువజాము నుంచే భక్తులు పుణ్యస్నానాలు ఆచరించి ప్రధానాలయానికి ఎదురుగా గల గంగాధర మండపం వద్ద, ఆలయ దక్షిణ మాడ వీధిలో దీపారాధన చేసుకుని ప్రత్యేక పూజలు నిర్వహించుకున్నారు.
సాయంత్రం ఆలయంలో దీపోత్సవ కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. గత సంవత్సరం మాదిరిగానే ఈ ఏడాది కూడా కార్తీకమాసం అంతా స్పర్శ దర్శనం నిలుపుదల చేసి, స్వామివారి అలంకార దర్శనం మాత్రమే భక్తులకు కల్పిస్తున్నారు. కార్తీక మాసంలో ప్రతి సోమవారం, కార్తీక పౌర్ణమి రోజున ఆలయ పుష్కరిణి వద్ద లక్ష దీపోత్సవం, పుష్కరిణి హారతి కార్యక్రమాలు నిర్వహించనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment