
శ్రీశైలంటెంపుల్: ఆరుద్ర నక్షత్రాన్ని పురస్కరించుకుని బుధవారం భ్రమరాంబా మల్లికార్జున స్వామిఅమ్మవార్లకు స్వర్ణ రథోత్సవం నిర్వహించారు

అర్చకులు వేకువజామున స్వామివారికి మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, అన్నాభిషేకం, విశేషపూజలు జరిపించారు

ఆలయ మహాద్వారం ముందుభాగం నుంచి నాలుగు మాడవీధులగుండా ఉత్సవాన్ని జరిపించారు

కోలాటం, చెక్కభజన తదితర జానపద కళారూపాలు ఆకట్టుకున్నాయి






