శ్రీశైలం టెంపుల్: శ్రీశైలంలో ఈ నెల 16–21 వరకు మహాకుంభాభిషేకం నిర్వహించనున్నారు. ఈ క్రతువు జరిపించాలని ఆలయాధికారులు భావించినా పలు కారణాలతో ఐదేళ్లుగా వాయిదా పడుతూ వచ్చింది. గతేడాది కుంభాభిషేకంతో పాటు శివాజీ గోపురానికి కూడా కలశ ప్రతిష్టాపన నిర్వహించాలని అధికారులు నిర్ణయించారు. కుంభాభిషేక పనులు కూడా సిద్ధం చేసినా అనుకోని విధంగా వాయిదా పడింది.
ఆ తరువాత ఓ హిందూ ధార్మిక సంస్థ పేరుతో కుంభాభిషేక నిర్వహణపై హైకోర్టుకు వెళ్లారు. కుంభాభిషేకాన్ని ఈ నెల 16– 21 వరకు నిర్వహించాలని హైకోర్టు సూచించడంతో అధికారులు కుంభాభిషేకానికి ఏర్పాట్లు ముమ్మరం చేశారు. మల్లికార్జున స్వామి గర్భగుడి, ఆలయంలో ఉన్న 4 గోపురాలతో పాటు అమ్మవారి ఆలయం వద్దనున్న గోపురానికి, ఉపాలయాల్లో ఏర్పాట్లు చేస్తున్నారు.
శిథిలావస్థకు చేరి కూలిపోయిన శివాజీ గోపురాన్ని దేవస్థానం పునఃనిర్మించింది. 2018లో ఈ నిర్మాణం పూర్తయినప్పటికీ ఇంతవరకు కలశ ప్రతిష్టాపన జరగలేదు. ఐదేళ్లుగా కలశ ప్రతిష్టాపనకు గోపురం నోచుకోలేదు. కుంభాభిషేకం నిర్వహణ సమయంలోనే కలశ ప్రతిష్టాపన, కుంభాభిషేకం నిర్వహించనున్నట్లు ఆలయ ఈవో డి.పెద్దిరాజు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment