ప్రధాని మోదీ.. ఉగాది విషెస్ | Narendra Modi Ugadi Wishes In Telugu | Sakshi
Sakshi News home page

ప్రధాని మోదీ.. ఉగాది విషెస్

Published Sat, Mar 17 2018 8:50 PM | Last Updated on Wed, Mar 20 2024 1:57 PM

దేశ పవిత్ర స్థలాలు, పుణ్యక్షేత్రాల్లో శ్రీశైలం ఒకటని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. తెలుగు ప్రజలకు ఉగాది పర్వదిన శుభాకాంక్షలు అంటూ తెలుగులోనే విషెస్ తెలిపారు మోదీ. న్యూఢిల్లీలో ఉన్న ప్రధాని మోదీ, శ్రీశైలం ఆలయ ప్రధాన అర్చకులతో వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతూ ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. మిమ్మల్ని నేరుగా కలిసే అవకాశం లేనందున వీడియో కాన్ఫరెన్స్‌లో మీతో మాట్లాడుతున్నానని అర్చకులకు చెప్పారు. తెలుగువారికి ఉగాది ఎంతో పవిత్రమైన పండుగ అన్నారు.

Advertisement
 
Advertisement
 
Advertisement