ugadi wishes
-
అందరికీ మంచి జరగాలి..
-
తెలుగు ప్రజలకు గవర్నర్ అబ్దుల్ నజీర్ ఉగాది శుభాకాంక్షలు
సాక్షి, అమరావతి: తెలుగు ప్రజలకు ఆంధ్రప్రదేశ్ గవర్నర్ అబ్దుల్ నజీర్ ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. ‘ఉగాది' పండుగ తెలుగు వారికి అత్యంత ముఖ్యమైన పండుగ. ప్రజలు ఆనందంగా, ఉత్సాహంగా జరుపుకునే ఈ నూతన సంవత్సరం.. అందరికీ కొత్త ఉత్తేజాన్ని, ఉల్లాసాన్ని, ఉజ్వల భవిష్యత్తును తెస్తుందని ఆశిస్తున్నాను’’ అని పేర్కొన్నారు. ‘‘జీవితంలోని షడ్రుచులను కలగలిపి ఉండే 'ఉగాది పచ్చడి', ఏడాది పొడవునా జీవితం మనకు అందించే అన్ని రకాల అనుభవాలకు ప్రతీకగా నిలుస్తుంది. ‘శోభకృతు’ నామ సంవత్సర ఉగాది పండుగ రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలకు శాంతి, శ్రేయస్సు, సామరస్యం, సంతోషాన్ని కలిగిస్తుందని నేను మనస్పూర్తిగా విశ్వసిస్తున్నాను’’ అని గవర్నర్ అన్నారు. చదవండి: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఉత్తర్వులు జారీ -
సన్ రైజర్స్ హైదరాబాద్ టీం ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలిపారు
-
ప్రధాని మోదీ.. ఉగాది విషెస్
-
ఎవరికో చెప్పులు తొడిగే స్టిల్‌తో మహేశ్ అదుర్స్
హైదరాబాద్: మొన్నటికి మొన్న శ్రీమంతుడిగా వచ్చి తన అభిమానుల నోటితోనే కాకుండా విమర్శకుల ప్రశంసలు కూడా టన్నుల కొద్ది మూటగట్టుకున్న టాలీవుడ్ హీరో సూపర్ స్టార్ మహేశ్ బాబు.. బ్రహ్మోత్సవం చిత్రంతో కూడా అలాంటి ప్రశంసలే అందుకోనున్నారా అంటే అవుననే అనిపిస్తుంది తాజాగా విడుదలైన పోస్టర్ చూస్తుంటే.. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో బ్రహ్మోత్సవం చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ చిత్ర యూనిట్ తెలుగువారి లోగిళ్లలో ఉగాది సందర్భంగా ఆ సినిమాకు సంబంధించిన ప్రచార చిత్రాన్ని ఉగాది శుభాకాంక్షలు పేరిట విడుదల చేసింది. ఈ పోస్టర్ ఎంత అద్భుతంగా ఉందంటే.. చూడగానే సినిమా నిండా తెలుగుదనం ఉట్టిపడనుందా అన్నట్లుగా ఉంది. ఈ పోస్టర్లో మహేశ్ బాబు చక్కగా వైట్ కోట్, బ్లూ జీన్స్ వేసి ఒక కాలు మడిచి మరో కాలు మొకాలిని నేలకు తాకించి ఎంతో వినయంగా ఓ వ్యక్తి పాదాలకు చెప్పులు తొడుగుతున్నాడు. వినయం, విధేయత, బంధాలు,బంధుత్వాలు, సంప్రదాయం అన్ని కలిపితేనే ఈ బ్రహ్మోత్సవం అని ఒక నిర్ణయానికి రావొచ్చేమో అనిపిస్తుంది. నిజంగా ఈ ప్రచార చిత్రంలో మహేశ్ బాబు పదహారేళ్ల కుర్రాడి అంత అందంగా మెరిసిపోయాడు. -
తెలుగు ప్రజలకు వైఎస్ జగన్ ఉగాది శుభాకాంక్షలు
ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలకు వైఎస్సీర్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. మన్మథనామ సంవత్సరం అందరి జీవితాల్లో వెలుగు నింపాలని ఆకాంక్షించారు. నూతన సంవత్సరంలో రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, అన్ని వర్గాల ప్రజలు సుఖశాంతులతో వర్థిల్లాలని అభిలాషించారు.