ఎవరికో చెప్పులు తొడిగే స్టిల్తో మహేశ్ అదుర్స్ | Brahmotsavam team relesed ugadi poster | Sakshi
Sakshi News home page

ఎవరికో చెప్పులు తొడిగే స్టిల్తో మహేశ్ అదుర్స్

Published Thu, Apr 7 2016 6:20 PM | Last Updated on Sun, Sep 3 2017 9:25 PM

ఎవరికో చెప్పులు తొడిగే స్టిల్తో మహేశ్ అదుర్స్

ఎవరికో చెప్పులు తొడిగే స్టిల్తో మహేశ్ అదుర్స్

హైదరాబాద్: మొన్నటికి మొన్న శ్రీమంతుడిగా వచ్చి తన అభిమానుల నోటితోనే కాకుండా విమర్శకుల ప్రశంసలు కూడా టన్నుల కొద్ది మూటగట్టుకున్న టాలీవుడ్ హీరో సూపర్ స్టార్ మహేశ్ బాబు.. బ్రహ్మోత్సవం చిత్రంతో కూడా అలాంటి ప్రశంసలే అందుకోనున్నారా అంటే అవుననే అనిపిస్తుంది తాజాగా విడుదలైన పోస్టర్ చూస్తుంటే.. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో బ్రహ్మోత్సవం చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ చిత్ర యూనిట్ తెలుగువారి లోగిళ్లలో ఉగాది సందర్భంగా ఆ సినిమాకు సంబంధించిన ప్రచార చిత్రాన్ని ఉగాది శుభాకాంక్షలు పేరిట విడుదల చేసింది.

ఈ పోస్టర్ ఎంత అద్భుతంగా ఉందంటే.. చూడగానే సినిమా నిండా తెలుగుదనం ఉట్టిపడనుందా అన్నట్లుగా ఉంది. ఈ పోస్టర్లో మహేశ్ బాబు చక్కగా వైట్ కోట్, బ్లూ జీన్స్  వేసి ఒక కాలు మడిచి మరో కాలు మొకాలిని నేలకు తాకించి ఎంతో వినయంగా ఓ వ్యక్తి పాదాలకు చెప్పులు తొడుగుతున్నాడు. వినయం, విధేయత, బంధాలు,బంధుత్వాలు, సంప్రదాయం అన్ని కలిపితేనే ఈ బ్రహ్మోత్సవం అని ఒక నిర్ణయానికి రావొచ్చేమో అనిపిస్తుంది. నిజంగా ఈ ప్రచార చిత్రంలో మహేశ్ బాబు పదహారేళ్ల కుర్రాడి అంత అందంగా మెరిసిపోయాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement