pvp cinema
-
ఘాజీ డైరెక్టర్ తో మెగా హీరో
తొలి సినిమాతోనే ఘన విజయం సాధించటంతో పాటు దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు సంకల్ప్ రెడ్డి. రానా హీరోగా 1971 నాటి భారత్ పాక్ యుద్ధ నేపథ్యంలో సంకల్ప్ రెడ్డి తెరకెక్కించిన ఘాజీ సినిమా సక్సెస్ సాధించటమే కాదు.. విశ్లేషకుల ప్రశంసలనూ అందుకుంది. ఇంతటి విజయం సాధించిన తరువాత సంకల్ప్ రెడ్డి చేయబోయే నెక్ట్స్ ప్రాజెక్ట్ పై అభిమానులతో పాటు సినీ వర్గాల్లోనూ ఆసక్తి నెలకొంది. ఘాజీ తరువాత విరామం తీసుకున్న సంకల్ప్ తన నెక్ట్స్ ప్రాజెక్ట్ విషయంలో ఒక నిర్ణయానికి వచ్చినట్టుగా తెలుస్తోంది. కెరీర్ స్టార్టింగ్ నుంచి ఇంట్రస్టింగ్ సినిమాలతో ఆకట్టుకుంటున్న మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా సంకల్ప్ రెడ్డి, తన నెక్ట్స్ సినిమాను తెరకెక్కించబోతున్నారట. సైన్స్ ఫిక్షన్ కథతో ఈ సినిమాను తెరకెక్కించేందుకు ప్లాన్ చేస్తున్నారు. విజువల్ ఎఫెక్ట్స్ ప్రధానంగా తెరకెక్కనున్న ఈ సినిమాను భారీ బడ్జెట్ తో తెరకెక్కించేందుకు ప్లాన్ చేస్తున్నారట. అయితే ఇప్పటికే వరుణ్, సంకల్ప్ కథకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడన్న టాక్ వినిపిస్తోంది. భారీ బడ్జెట్ తో తెరకెక్కబోయే ఈ సినిమాకు నిర్మాత ఎవరన్నది ఇంకా కన్ఫామ్ కాలేదు. తన తొలి చిత్రాన్ని నిర్మించిన పీవీపీ సంస్థకే రెండో సినిమా చేసేందుకు సంకల్ప్ ఆసక్తికనబరుస్తున్నారు. పీవీపీ సంస్థ ఓకె చెపితే త్వరలోనే సంకల్ప్, వరుణ్ తేజ్ ల సినిమాలపై అఫీషియల్ ఎనౌన్స్ మెంట్ వచ్చే ఛాన్స్ ఉంది. -
ఓంకార్ 'రాజుగారి గది-2'
దర్శకుడిగా మారిన పాపులర్ టీవీ యాంకర్ ఓంకార్ మరోసారి ప్రేక్షకులను పలకరించనున్నాడు. తన తమ్ముడు అశ్విన్‌ను హీరోగా పెట్టి 'రాజుగారి గది' అనే హారర్ కామెడీని తెరకెక్కించిన విషయం తెలిసిందే. సినిమా అనుకున్నదాని కంటే హిట్ అవ్వడంతో మళ్లీ అదే జానర్లో 'రాజుగారి గది-2' ను తీసేందుకు సిద్ధమవుతున్నాడు. మరింత భయంతో కూడిన వినోదాన్ని ప్రేక్షకులకు అందించే పనిలో పడ్డాడు. ఓంకార్ 'రాజుగారి గది' చిత్రాన్ని వారాహి చలన చిత్ర బ్యానర్ సహకారంతో నిర్మించిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు 'రాజుగారి గది-2' చిత్రానికి పి.వి.పి సినిమా బ్యానర్ తోడయ్యింది. పివిపి సినిమా, మ్యాట్నీ ఎంటర్టెయిన్మెంట్ , ఓక్ ఎంటర్టెయిన్మెంట్ ప్రై.లి. బ్యానర్స్ సంయుక్తంగా 'రాజుగారి గది-2' నిర్మించేందుకు ముందుకొచ్చాయి. నటీనటులు, ఇతర టెక్నీషియన్ల ఎంపిక జరగాల్సి ఉందని, త్వరలోనే పూర్తి వివరాలు తెలియజేస్తామని పివిపి సంస్థ ఓ ప్రకటనలో తెలిపింది. -
ఎవరికో చెప్పులు తొడిగే స్టిల్‌తో మహేశ్ అదుర్స్
హైదరాబాద్: మొన్నటికి మొన్న శ్రీమంతుడిగా వచ్చి తన అభిమానుల నోటితోనే కాకుండా విమర్శకుల ప్రశంసలు కూడా టన్నుల కొద్ది మూటగట్టుకున్న టాలీవుడ్ హీరో సూపర్ స్టార్ మహేశ్ బాబు.. బ్రహ్మోత్సవం చిత్రంతో కూడా అలాంటి ప్రశంసలే అందుకోనున్నారా అంటే అవుననే అనిపిస్తుంది తాజాగా విడుదలైన పోస్టర్ చూస్తుంటే.. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో బ్రహ్మోత్సవం చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ చిత్ర యూనిట్ తెలుగువారి లోగిళ్లలో ఉగాది సందర్భంగా ఆ సినిమాకు సంబంధించిన ప్రచార చిత్రాన్ని ఉగాది శుభాకాంక్షలు పేరిట విడుదల చేసింది. ఈ పోస్టర్ ఎంత అద్భుతంగా ఉందంటే.. చూడగానే సినిమా నిండా తెలుగుదనం ఉట్టిపడనుందా అన్నట్లుగా ఉంది. ఈ పోస్టర్లో మహేశ్ బాబు చక్కగా వైట్ కోట్, బ్లూ జీన్స్ వేసి ఒక కాలు మడిచి మరో కాలు మొకాలిని నేలకు తాకించి ఎంతో వినయంగా ఓ వ్యక్తి పాదాలకు చెప్పులు తొడుగుతున్నాడు. వినయం, విధేయత, బంధాలు,బంధుత్వాలు, సంప్రదాయం అన్ని కలిపితేనే ఈ బ్రహ్మోత్సవం అని ఒక నిర్ణయానికి రావొచ్చేమో అనిపిస్తుంది. నిజంగా ఈ ప్రచార చిత్రంలో మహేశ్ బాబు పదహారేళ్ల కుర్రాడి అంత అందంగా మెరిసిపోయాడు. -
పోలీస్ గెటప్‌లో అనసూయ
చెన్నై : వెండి తెరపై అనసూయ మళ్లీ మెరవనుంది. ఇటీవలే సొగ్గాడే చిన్నినాయనా చిత్రంలో తళుక్కన మెరిసిన అనసూయ... ఈసారి మాత్రం పవర్ఫుల్ పాత్రలో నటించనుంది. 'క్షణం' పేరుతో తెరకెక్కుతున్న చిత్రంలో పోలీస్ అధికారి పాత్రలో ఆమె ఒదిగిపోనుంది. నీతి నిజాయితీకి మారు పేరుగా మలిచిన పాత్రలో అనసూయ నటించనుంది. పీవీపీ సినిమా నిర్మిస్తున్న 'క్షణం' చిత్రానికి రవికాంత్ పి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మేరకు చిత్ర యూనిట్ గురువారం చెన్నైలో వెల్లడించింది. ఈ చిత్రంలో ఆ పాత్ర పోషించేందుకు పలువురు మహిళా పోలీసు అధికారులను అనసూయ దగ్గర నుంచి పరిశీలించారని తెలిపింది. ఆ పాత్రలో నటించేందుకు ఆమె చాలా ప్రిపేరయిందని ... ఆ తర్వాతే నటించేందుకు అనసూయ ఒప్పుకుందని యూనిట్ పేర్కొంది. ఈ చిత్రంలోని అనసూయ నటనకు ప్రేక్షకులు బ్రహ్మరథం పడతారని చిత్ర యూనిట్ ఆశాభావం వ్యక్తం చేసింది. ఈ సస్పెన్స్, శృంగారం కథాంశంతో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో అడవి శేషు, అదా శర్మ ముఖ్య భూమిక పోషిస్తున్నారని తెలిపింది. -
అందం... ఆనందం
మహేశ్‌బాబు... ఒకప్పుడు యూత్‌లో యమా ఫాలోయింగ్. కట్ చేస్తే.. ఫ్యామిలీస్‌కి కూడా ఇష్టమైన హీరో అయిపోయారు. చాక్లెట్ బోయ్... మాస్ హీరో... ఫ్యామిలీ హీరో.. మహేశ్‌ని ఇలా ఏదో ఒక కేటగిరీకి పరిమితం చేయలేం. ఆయన ‘ఆల్ రౌండర్’. ఇంకా చెప్పాలంటే, సూపర్ స్టార్ కృష్ణ తనయుడిగా పరిశ్రమకు వచ్చి, ‘మహేశ్‌బాబు తండ్రి కృష్ణ’ అనిపించుకున్నారు. ఇది ఏ తండ్రికైనా ఆనందంగానే ఉంటుంది. కథానాయకునిగా ఇప్పటికి దాదాపు 20 చిత్రాల ద్వారా అలరించిన మహేశ్ ఇప్పుడు ‘శ్రీమంతుడు’ చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఆదివారం కృష్ణ జన్మదినాన్ని పురస్కరించుకుని మహేశ్ తాజా చిత్రం ‘బ్రహ్మోత్సవం’ని ప్రారంభించారు. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో పీవీపీ సినిమా పతాకంపై పెరల్.వి.పొట్లూరి, పరమ్ వి.పొట్లూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ముహూర్తపు షాట్‌కు పెరల్ వి. పొట్లూరి, పరమ్. వి.పొట్లూరి కెమెరా స్విచ్చాన్ చేసి, క్లాప్ ఇచ్చారు. ఈ సందర్భంగా శ్రీకాంత్ అడ్డాల మాట్లాడుతూ- ‘‘ఎక్కడైనా ఓ నలుగురు ఉన్న చోట అందం, ఆనందం ఉంటాయి. అలాంటిది అనేక మంది ఓ కుటుంబంలో ఉండి ప్రతి సందర్భాన్నీ ఓ ఉత్సవంలా జరుపుకుంటే.. అదే ఈ ‘బ్రహ్మోత్సవం’. ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ తర్వాత మహేశ్‌తో మంచి సినిమా చేస్తున్నాను’’ అని చెప్పారు. ‘‘జూలై 10 న రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించి, సంక్రాంతి కానుకగా జనవరి 8న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నాం’’ అని నిర్మాతలు తెలిపారు. సత్యరాజ్, జయసుధ, తనికెళ్ల భరణి, రావు రమేశ్ తదిత రులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: ఆర్. రత్నవేలు, సంగీతం: మిక్కీ జె. మేయర్, ఆర్ట్: తోట తరణి. -
శ్రుతిహాసన్ దిగొచ్చారా?
నటి శ్రుతిహాసన్ దిగొచ్చారా? నటించనని వైదొలగిన చిత్రంలో తిరిగి భాగం కానున్నారా? వివాదస్పదం కావొద్దన్న సన్నిహితులు హితవు పని చేసిందా? అలాంటి అంశాలు కోలీవుడ్‌లో ప్రస్తుతం చర్చగా మారాయి. టాలీవుడ్ నటుడు నాగార్జున, కోలీవుడ్ నటుడు కార్తీ కలసి నటిస్తున్న భారీచిత్రాన్ని పీవీపీ సినిమా నిర్మిస్తున్న సంగతి ఆ చిత్రంలో నటించడానికి ఒప్పుకుని, చిత్ర షూటింగ్ ప్రారంభమైన తరువాత నటించనని చెప్పిన నటి శ్రుతిహాసన్ వ్యవహారం హాట్‌గా మారిన విషయం తెలిసిందే. చిత్ర నిర్మాతలు శ్రుతిహాసన్‌పై కోర్టుకు వెళ్లిన విషయం ఆమెను కొత్త చిత్రాలు అంగీకరించరాదని కోర్టు ఆదేశించిన విషయం విదితమే. కాగా ఆ చిత్రంలో శ్రుతిహాసన్ పాత్రలో నటి తమన్నను నటింప చేసే ప్రయత్నాలు జరుగుతున్నట్లు మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఇలాంటి పరిస్థితిలో కథ అనూహ్య మలుపు తిరిగినట్లు తాజా సమాచారం. నటించనని వైదొలగిన చిత్రంలో నటి శ్రుతిహాసన్ నటించడానికి సిద్ధం అయినట్లు తెలిసింది. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో నటిస్తూ ప్రముఖ హీరోయిన్గా వెలుగొందుతున్న సమయంలో వివాదాలకు పోయి సమస్యలను కొని తెచ్చుకోవద్దని శ్రుతిహాసన్ సన్నిహితులు మాటలు పని చేశాయని సమాచారం. దీంతో పీవీపీ సంస్థ నిర్మిస్తున్న చిత్రంలో శ్రుతి నటించే విషయమై సామరస్య పూర్వక చర్చలు జరుగుతున్నట్లు కోలీవుడ్ టాక్. -
శ్రుతి ఔట్.. తమన్నా ఇన్..
శ్రుతి ఔట్.. తమన్నా ఇన్,,! ఇదీ టాలీవుడ్, కోలీవుడ్‌లో లేటెస్ట్ అప్డేట్. నాగార్జున, కార్తీ, వంశీ పైడిపల్లి కాంబినేషన్లో పీవీపీ సినిమాస్ నిర్మిస్తోన్న ద్విభాషా చిత్రంలో మొదట నటిస్తానని చెప్పి.. ఒక షెడ్యూల్ షూటింగ్ పూర్తయిన తర్వాత డేట్లు ఖాళీలేవంటూ నిర్మాతలకు హ్యాండ్ ఇచ్చిన శ్రుతి.. కోర్టు చేత చివాట్లు తిన్న సంగతి తెలిసిందే. ఇప్పుడు అదే సినిమాలో ఆమె స్థానంలో తమన్నాను ఎంపిక చేసినట్లు నిర్మాణ సంస్థ ప్రతినిధుల ద్వారా తెలిసింది. ఒకటి రెండు రోజుల్లో ఈ వార్తను అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. ఫ్రెంచ్ చిత్రం 'ది ఇన్టచబుల్' స్ఫూర్తితో రూపొందుతున్న ఈ సినిమాలో నాగ్ ఓ వ్యాధిగ్రస్తుడిగా, అతని సహాయకుడి పాత్రలో కార్తీ నటిస్తున్నారు. కార్తీకి జోడిగా తమన్నా ఎంపిక ఖరారవ్వడంతో గతంలో శ్రుతితో చేసిన సీన్లన్నీ రీషూట్ చేయాలని దర్శకుడు వంశీ అనుకుంటున్నాడట. శ్రుతి చర్యతో తాము తీవ్రంగా నష్టపోయామని పీవీపీ సినిమాస్ సంస్థ కోర్టు కెక్కిన సంగతి తెలిసిందే. వివాదం పరిష్కారమయ్యేంతవరకు కొత్త సినిమాలేవీ అంగీకరించొద్దని కోర్టు శ్రుతి హాసన్‌ను ఆదేశించింది. తమన్నా ప్రస్తుతం రవితేజ సరసన 'బెంగాల్ టైగర్' సినిమాలో నటిస్తోంది. -
విజయవాడలో సచిన్, అనుష్కల సందడి