ఘాజీ డైరెక్టర్ తో మెగా హీరో | Ghazi Fame sankalp reddy Next movie with varun tej | Sakshi
Sakshi News home page

ఘాజీ డైరెక్టర్ తో మెగా హీరో

Published Wed, Oct 4 2017 11:24 AM | Last Updated on Wed, Oct 4 2017 12:33 PM

Varun Tej Sankalp reddy

తొలి సినిమాతోనే ఘన విజయం సాధించటంతో పాటు దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు సంకల్ప్ రెడ్డి. రానా హీరోగా 1971 నాటి భారత్ పాక్ యుద్ధ నేపథ్యంలో సంకల్ప్ రెడ్డి తెరకెక్కించిన ఘాజీ సినిమా సక్సెస్ సాధించటమే కాదు.. విశ్లేషకుల ప్రశంసలనూ అందుకుంది. ఇంతటి విజయం సాధించిన తరువాత సంకల్ప్ రెడ్డి చేయబోయే నెక్ట్స్ ప్రాజెక్ట్ పై అభిమానులతో పాటు సినీ వర్గాల్లోనూ ఆసక్తి నెలకొంది.

ఘాజీ తరువాత విరామం తీసుకున్న సంకల్ప్ తన నెక్ట్స్ ప్రాజెక్ట్ విషయంలో ఒక నిర్ణయానికి వచ్చినట్టుగా తెలుస్తోంది. కెరీర్ స్టార్టింగ్ నుంచి ఇంట్రస్టింగ్ సినిమాలతో ఆకట్టుకుంటున్న మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా సంకల్ప్ రెడ్డి,  తన నెక్ట్స్ సినిమాను తెరకెక్కించబోతున్నారట. సైన్స్ ఫిక్షన్ కథతో ఈ సినిమాను తెరకెక్కించేందుకు ప్లాన్ చేస్తున్నారు. విజువల్ ఎఫెక్ట్స్ ప్రధానంగా తెరకెక్కనున్న ఈ సినిమాను భారీ బడ్జెట్ తో తెరకెక్కించేందుకు ప్లాన్ చేస్తున్నారట.

అయితే ఇప్పటికే వరుణ్, సంకల్ప్ కథకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడన్న టాక్ వినిపిస్తోంది. భారీ బడ్జెట్ తో తెరకెక్కబోయే ఈ సినిమాకు నిర్మాత ఎవరన్నది ఇంకా కన్ఫామ్ కాలేదు. తన తొలి చిత్రాన్ని నిర్మించిన పీవీపీ సంస్థకే రెండో సినిమా చేసేందుకు సంకల్ప్ ఆసక్తికనబరుస్తున్నారు. పీవీపీ సంస్థ ఓకె చెపితే త్వరలోనే సంకల్ప్, వరుణ్ తేజ్ ల సినిమాలపై అఫీషియల్ ఎనౌన్స్ మెంట్ వచ్చే ఛాన్స్ ఉంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement