
సాక్షి, కర్నూలు: శ్రీశైలం దేవస్థానంలో కరోనా కల్లోలం రేపుతుంది. శ్రీశైలంలో ఒక్కరోజే 13 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. శ్రీశైలం దేవస్థానం వైద్యశాల వైద్యుడితో పాటు, ముగ్గురి సిబ్బందికి కరోనా వైరస్ సోకింది. శ్రీశైలం మండలం లో ఇప్పటివరకు 19 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో శ్రీశైలం దేవస్థానంలో వారంపాటు దర్శనాలను నిలిపివేస్తున్నట్లు ఆలయ అధికారులు ప్రకటించారు. ఒకేరోజు 13 కరోనా కేసులు నిర్ధారణ కావడంతో ఆలయ ఉద్యోగులు, స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment