
అక్కినేని నాగ చైతన్య ,శోభిత ధూళిపాళ మూడు ముళ్లతో వివాహ బంధంలోకి అడుగుపెట్టారు.

అయితే, ఈ నూతన దంపతులు కొత్త జీవితాన్ని ఆనందంగా ప్రారంభించాలని అక్కినేని అభిమానులు, ఆత్మీయులు ఆశీర్వదించారు

పెళ్లి అయిన వెంటనే వారిద్దరూ మొదటగా శ్రీశైలం మల్లన్నను దర్శించుకుని ఆశీర్వాదం తీసుకున్నారు.నూతన వధూవరులతో పాటు అక్కినేని నాగార్జున కూడా ఉన్నారు.

ఇరువురి కుటుంబ సభ్యులు అందరూ స్వామి, అమ్మవార్లను దర్శించుకున్న తర్వాత స్వామివారికి రుద్రాభిషేకం నిర్వహించారు.

కొత్త దంపతులకు అర్చకులు వేదాశీర్వచనంతో పాటు ఆలయ మహాద్వారం వద్ద వారికి అర్చకులు స్వాగతం పలికారు.

అనంతరం ప్రసాదాలు వారికి అందించారు. పెళ్లి తర్వాత మొదటిసారి జంటగా చై-శోభిత కనిపించడంతో అభిమానులు భారీగా గుమికూడారు.




