గతేడాదితో పోల్చిచూస్తే ఈ ఏడాది మహాశివరాత్రి ఆదాయం సుమారు రూ.85 వేలు తగ్గింది. కోటిపల్లిలోని శ్రీ ఛాయా సోమేశ్వరస్వామి ఆలయంలో గురువారం హుండీలను ప్రత్యేకాధికారి బలుసు రామకృష్ణ పర్యవేక్షణలో లెక్కించారు. హుండీ ద్వారా రూ.3.12 లక్షలు, టికెట్ల ద్వారా రూ.2.70 లక్షలు మొత్తం రూ.5.82 లక్షల ఆదాయం లభించిందని ఆలయ ఈఓ కె.రామచంద్రరావు తెలిపారు. గతేడాది టికెట్లు,
తగ్గిన మహాశివరాత్రి ఆదాయం
Mar 2 2017 11:20 PM | Updated on Oct 8 2018 7:04 PM
కె.గంగవరం (రామచంద్రపురం) :
గతేడాదితో పోల్చిచూస్తే ఈ ఏడాది మహాశివరాత్రి ఆదాయం సుమారు రూ.85 వేలు తగ్గింది. కోటిపల్లిలోని శ్రీ ఛాయా సోమేశ్వరస్వామి ఆలయంలో గురువారం హుండీలను ప్రత్యేకాధికారి బలుసు రామకృష్ణ పర్యవేక్షణలో లెక్కించారు. హుండీ ద్వారా రూ.3.12 లక్షలు, టికెట్ల ద్వారా రూ.2.70 లక్షలు మొత్తం రూ.5.82 లక్షల ఆదాయం లభించిందని ఆలయ ఈఓ కె.రామచంద్రరావు తెలిపారు. గతేడాది టికెట్లు, హుండీల ద్వారా ఆదాయం రూ.6.67 లక్షల ఆదాయం వచ్చింది. గ్రామపెద్ద పప్పుల మసేను వెంకన్న, వెంటూరి వీరరాఘవులు, చిన్న, దేవస్థాన సిబ్బంది మట్టపర్తి శ్రీనివాస్‌రావు, కూర్మాపురం రామకృష్ణ, పద్దయ్య, సతీష్, ఆలయ అర్చుకులు, పండితులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement