మహాశివరాత్రి ప్రజల జీవితాలకు మేల్కొలుపు : గవర్నర్‌   | Governor Tamilisai Soundararajan Extends Greetings On Mahashivratri | Sakshi
Sakshi News home page

మహాశివరాత్రి ప్రజల జీవితాలకు మేల్కొలుపు : గవర్నర్‌  

Published Sat, Feb 18 2023 12:50 AM | Last Updated on Sat, Feb 18 2023 12:50 AM

Governor Tamilisai Soundararajan Extends Greetings On Mahashivratri - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ శుభాకాంక్షలు తెలిపారు. జాగారం రూపంలో మేల్కొని ఉంచే మహాశివరాత్రి ప్రజల జీవితాలకు మేల్కొలుపు అని పేర్కొన్నారు. మహాశివరాత్రి కోట్లాది మంది శివుడి భక్తులకు ఆరాధ్యమైన పర్వదినమని తెలిపారు.

ఈ పర్వదినం సందర్భంగా సమాజంలో శాంతి, సౌభ్రాతృత్వం, సోదరభావాన్ని పెంపొందించాలని గవర్నర్‌ ప్రార్థించారు.   కాగా, పుదుచ్చేరి లెఫ్టినెంట్‌ గవర్నర్‌గా రెండేళ్ల పదవీకాలం పూర్తిచేసుకున్న తమిళిసైని పుదుచ్చేరి సీఎం రంగస్వామి సత్కరించారు.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement