
బంగారు బల్లి అంటేనే తమిళనాడులోని కాంచీపురం కామాక్షి ఆలయం గుర్తుకొస్తుంది. అక్కడి ఆలయంలో బంగారు తొడుగులతో ఏర్పాటుచేసిన బల్లిని తాకితే సకల దోషాలు తొలగుతాయని భక్తుల విశ్వాసం. అలాంటిది నిజమైన బంగారు బల్లిని దర్శించే భాగ్యం తిరుమల కొండల్లో మాత్రమే కలుగుతుంది. అంతరించే జాతుల్లో చేరిన ఈ బంగారు బల్లి కొన్నేళ్లుగా కనిపించడం లేదు.
అయితే శుక్రవారం మహాశివరాత్రి పర్వదినాన ఈ బంగారు బల్లి తిరుమలలోని శ్రీవారి ఆలయానికి వెనుకనున్న శిలాతోరణంపై దర్శనమిచ్చింది. కాగా, మునుపు ఒకసారి మహాశివరాత్రి నాడే (2016లో) ఈ బంగారు బల్లి తిరుమల చక్రతీర్థం వద్ద మహాశివలింగానికి అభిషేకం చేసే శుభ సమయంలో భక్తుల కంటపడటం విశేషం. (రాయంచపై సోమస్కంధుడి రాజసం )
Comments
Please login to add a commentAdd a comment