
శ్రీవారి సేవలో కంచిపీఠాధిపతి
తిరుమల:కంచిపీఠాధిపతి జయేంద్ర సరస్వతి శుక్రవారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఆలయ మర్యాదలతో ఆయనకు అధికారులు, వేదపండితులు స్వాగతం పలికారు. పీఠాధిపతి ముందుగా ధ్వజస్తంభానికి మొక్కుకుని, తర్వాత శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు పీఠాధిపతి ఆశీస్సులు అందుకున్నారు.