సింగపూర్‌లో ఘనంగా మహాశివరాత్రి వేడుకలు | Mahashivratri 2024 grand celebrations in Singapore | Sakshi
Sakshi News home page

సింగపూర్‌లో ఘనంగా మహాశివరాత్రి వేడుకలు

Published Mon, Mar 11 2024 11:30 AM | Last Updated on Mon, Mar 11 2024 11:49 AM

Mahashivratri 2024 grand celebrations in Singapore - Sakshi

సింగపూర్‌లో ఘనంగా మహాశివరాత్రి వేడుకలు

 పంచారామ ప్రతీకగా లింగ్గోద్భవ సమయంలో ఏకాదశ రుద్రాభిషేకం

మన ఋషులు వేద ప్రమాణంగా నిర్దేశించిన దిశను, సాంప్రదాయ, అనుష్ఠానాలని కొనసాగించాలన్న ముఖ్య ఉద్దేశంతో సింగపూర్‌లో నివసించే  తెలుగువారు, సింగపూర్ తెలుగు బ్రాహ్మణ సమాజంగా ఏర్పడి , ధర్మ నిరతి, ధర్మానుష్టానం కొరకు 2014 నుంచి అనేక కార్యక్రమాలు అయిన నిత్యసంధ్యావందనం, లక్ష గాయత్రి హోమం, సామూహిక సత్యనారాయణస్వామి వ్రతం, మాస శివరాత్రి సందర్భంగా ప్రతినెలా రుద్రాభిషేకం ఘనంగా నిర్వహిస్తూ విజయవంతంగా కొనసాగిస్తున్నారు. ఈ సంవత్సరం దశమ వార్షికోత్సవం జరుపుకోబోతున్న ఈ శుభసందర్భంలో  అనేక కార్యక్రమాలు  రూపొందించామని నిర్వాహుకులు తెలిపారు.

ఇందులో భాగంగా మహాశివరాత్రి  పర్వదిన సందర్భంగా శుక్రవారం 8 మార్చి 2024 రాత్రి 11 గంటలు నుండి శనివారం ఉదయం 6 గంటలు వరకు శ్రీ అరసకేసరి శివాన్ మందిరంలో పంచారామ ప్రతీకగా లింగ్గోద్భవ సమయంలో ఏకాదశ రుద్రాభిషేకం ఘనంగా నిర్వహించబడింది. 

భారతదేశం నుండి తెప్పించిన శ్రేష్ఠమైన పుట్టమన్నుతో పంచ లింగాలను, పార్థివ లింగములుగా సమంత్రకముగా రూపొందించారు. ఈ సందర్భంగా పంచ రుద్రులుకి ఏకాదశ రుద్రాభిషేకం ఘనంగా నిర్వహించారు. సుమారు 7 గంటలు జరిగిన ఈ క్రతువులో దాదాపు 50 మందికి పైగా రుత్వికులు పాల్గొన్నారు. వందమందికి పైగా భక్తులు  పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

కార్యక్రమానికి వచ్చిన మహిళలు లలితా పారాయణం, హారతి గానంతోఅందరూ భక్తి పారవశ్యంలో మునిగి తేలారు.  అనంతరం అతిథులకు తీర్ధ ప్రాసాదాలందించారు.

మహాశివరాత్రి రోజున అభిషేకం, అందునా పంచారామ లింగార్చనతో కూడుకొన్నజాగరణ తదితర  కార్యక్రమాలపై భక్తులు హర్షం వ్యక్తం చేసారు, కార్యక్రమ రూపకర్తలకు, నిర్వాహకులకు ధన్యవాదాలు తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement