స్వరలయ ఆర్ట్స్ సింగపూర్ ఫైన్ ఆర్ట్స్ అకాడమీ వారు (2024 మార్చి 3వ తేదీ) 5 వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ఆచార్య వై. రెడ్డి శ్యామల, పీఠాధిపతి, భాషాభివృద్ధి పీఠం, డైరెక్టర్ ఐ/సి, అంతర్జాతీయ తెలుగు కేంద్రం, పొట్టి శ్రీరాములు, తెలుగు విశ్వవిద్యాలయం గారు విచ్చేసి తెలుగు భాష మన దైనందిన జీవితానికి ఎంతో ముఖ్య మైనది అని వివరించారు
అన్నమయ్య పద మాధుర్యం గురించి మాట్లాడుతూ శేషుకుమారి గానం, ప్రత్యూష నాట్యం మేళ వింపుతో ప్రేక్షకులను మైమరపింప చేశారు. ఈ కార్యక్రమానికి STS వైస్ ప్రెసిడెంట్ జ్యోతీ శ్వర్, TAS (మనం తెలుగు) అసోసియేషన్ అనిత రెడ్డి శ్రీ సాంస్కృతిక కళా సారథి రత్న కుమార్ కమల క్లబ్ అధ్యక్షులు, సారీ కనెక్షన్ అడ్మిన్ పద్మజ నాయుడు మగువ మనసు అడ్మిన్ ఉష, సింగపూర్ తెలుగు వనితలు క్రాంతి, జయ, ప్రత్యూష తదితర సింగపూర్ తెలుగు కమ్యూనిటీ వ్యవస్థాపకులు హాజరు కావటం విశేషం.
స్వరలయ ఆర్ట్స్, సింగపూర్ వ్యవస్థాపక అధ్యక్షురాలు యడవల్లి శేషుకుమారి, శిష్యులుచిన్నారులు కీర్తనలు, స్వరలయ ఆర్ట్స్, సింగపూర్‌కు అనుబంధ సంస్థ అభినయ నాట్యాలయ చిన్నారులు ,ప్రత్యూష శిష్య బృందం నాట్యం ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి
పొట్టి శ్రీరాములు, తెలుగు విశ్వవిద్యాలయం సర్టిఫికేట్ కోర్సు మొదటి వత్సరం ఉత్తీర్ణత పొందిన స్వరలయ ఆర్ట్స్ విద్యార్థులకు ఆచార్య వై. రెడ్డి శ్యామల బహుమతి ప్రదానం చేశారు. అతిథులకుయడవల్లి శేషుకుమారి ఆచార్య వై. రెడ్డి శ్యామల మూమెంటోలను బహుకరించారు. మృదంగ వాయిద్య సహకారాన్ని శివ కుమార్ అందించారు. ఈ కార్యక్రమానికి సౌజన్య, ప్రసన్న వ్యాఖ్యాతలుగా వ్యవహరించారు.
పలువురికీ లలిత కళా రంగంలో ఉత్సాహ పరుస్తూ ముందుకు నడిచే ఇటువంటి కార్యక్రమానికి దాదాపుగా 150 మంది హాజరు కావటమే కాకుండా.. సాంఘిక మాధ్యమాలాద్వారా కూడా వీక్షించి విశేషస్పందన తెలియజేయటం అభినందనీయం.
Comments
Please login to add a commentAdd a comment