తెలుగు సంస్కృతి, సాంప్రదాయాలను పరిరక్షించడంలో ఎల్లప్పుడూ ముందుండే సింగపూర్ తెలుగు సమాజం.. సంక్రాంతి సంబరాలను వైభవంగా నిర్వహించింది. సింగపూర్‌లోని PGP హాల్‌లో జరిగిన ఈ వేడుకలకు తెలుగువారు భారీగా తరలివచ్చారు.
సంక్రాంతి వేడుకల్లో భాగంగా వరుసగా ఏడోసారి తెలుగు క్యాలెండర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ప్రేక్షకులను ఉర్రూతలూగించాయి. బాలబాలికలు రామాయణాన్ని చక్కగా ప్రదర్శించి పలువురి మన్నలను పొందారు. అచ్చ తెలుగు పిండివంటలు, 34 రకాల నోరూరించే వంటకాలతో కూడిన భోజనం స్థానిక తెలుగు వారిని విశేషంగా ఆకట్టుకుంది.
తెలుగు సంక్రాంతి వాతావరణంలో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి విచ్చేసి విజయవంతం చేసిన వారందరికీ STS అధ్యక్షులు బొమ్మారెడ్డి శ్రీనివాసులరెడ్డి పేరు పేరునా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. తమ కార్యవర్గం గత సంవత్సర కాలంగా నిర్వహించిన కార్యక్రమాలను వివరించడంతో పాటు అందరూ మరింత సహాయ సహకారాలను అందించాలని, 50వ ఆవిర్భావ దినోత్సవం లోపు సమాజ భవన స్వప్నాన్ని సాకారం చేసే దిశగా తోడ్పాటు నందించాలన్నారు.
Comments
Please login to add a commentAdd a comment