సింగపూర్‌లో శ్రీరాముని ప్రాణ ప్రతిష్ఠ ఉత్సవాలు | Ayodhya Ram Mandir Pran Pratistha Celebrations At Singapore | Sakshi
Sakshi News home page

సింగపూర్‌లో శ్రీరాముని ప్రాణ ప్రతిష్ఠ ఉత్సవాలు

Published Tue, Jan 23 2024 4:04 PM | Last Updated on Tue, Jan 23 2024 4:31 PM

Ayodhya Ram Mandir Pran Pratistha Celebrations At Singapore - Sakshi

తెలంగాణ కల్చరల్ సొసైటీ సింగపూర్ ఆధ్వర్యంలో వైభవంగా అయోధ్య శ్రీరామ పవిత్ర అక్షింతల వితరణ మహోత్సవం జరిగింది. తెలంగాణ కల్చరల్ సొసైటీ సింగపూర్ (TCSS) వారు భారత దేశం నుండి ప్రత్యేకంగా తెప్పించిన అయోధ్య శ్రీ రాముల వారి ప్రాణ ప్రతిష్ట అక్షింతలు సింగపూర్ లో నివసిసిస్తున్న భక్తులకు అందజేసే శుభకార్యాన్ని అదే రోజు జనవరి 22 న ఇక్కడి చాంగి విలేజ్ లో ఉన్న శ్రీ రాముని గుడిలో కన్నుల పండుగలా నిర్వహించారు.

       

ఇటువంటి పవిత్రమైన కార్యక్రమాన్ని ఇక్కడి దేవాలయాల్లో నిర్వహించే అవకాశం దక్కడం సొసైటీకి దక్కిన పుణ్యం అని అక‍్కడి సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక భక్తులందరూ భక్తిశ్రద్ధలతో రామ నామ స్మరణ చేస్తూ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం, అందరూ ప్రసాదంతో పాటు అక్షింతలు కూడా స్వీకరించి శ్రీ రాముని ఆశీసులు పొందారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణమంతా జై శ్రీ రామ్ అనే నామస్వరణతో మారుమ్రోగింది. 

ఈ వేడుకల్లో చిన్న పెద్ద అనే తేడా లేకుండా అందరు ఆ రాముని సేవలో భక్తితో పరవశించి పోయారు. ఈ మహోత్సవంలో సుమారు 1000 మంది వరకు భక్తులు పాల్గొని అయోధ్య శ్రీరామ పవిత్ర అక్షింతలను స్వీకరించారు. ఈ సందర్భంగా అక్కడ ఉన్న కొందరు భక్తులు మాట్లాడుతూ.. ఇటువంటి కార్యక్రమాన్ని సింగపూర్లో నిర్వహించిన తెలంగాణ కల్చరల్ సొసైటీ సింగపూర్ వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపుతు అభినందించారు. దీంతో పాటు సొసైటీ స్థాపన నుండి ఎలాంటి ఆడంబరాలకు పోకుండా, లాభాపేక్ష లేకుండా విభిన్న కార్యక్రమాలు నిర్వహిస్తున్న సొసైటీని స్థానికులు కొనియాడారు. 

తెలుగు వారితో పాటు ఇతర భక్తులు పెద్ద ఎత్తున రాముని సేవలో పాల్గొని విజయవంతంగా జరిగేందుకు తోడ్పడిన, సహాయ సహకారాలు అందించిన దాతలకు, ప్రతి ఒక్కరికి పేరు పేరున టీసీఎస్‌ఎస్‌ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. 

ఈ సందర్భంగా ప్రతిఒక్కరికి సొసైటీ అధ్యక్షులు గడప రమేష్ బాబు, ప్రధాన కార్యదర్శి బసిక ప్రశాంత్ రెడ్డి, కోశాధికారి జూలూరి సంతోష్ కుమార్, సొసైటీ ఉపాధ్యక్షులు దుర్గ ప్రసాద్, భాస్కర్ గుప్త నల్ల, గోనె నరేందర్ రెడ్డి, ఉపాధ్యక్షురాలు మిర్యాల సునీత రెడ్డి, సంస్థాగత కార్యదర్శి, కాసర్ల శ్రీనివాస రావు, ప్రాంతీయ కార్యదర్శులు బొందుగుల రాము, నంగునూరి  వెంకటరమణ, నడికట్ల భాస్కర్, రవి కృష్ణ విజాపూర్, కార్యవర్గ సభ్యులు రోజా రమణి, రాధికా రెడ్డి నల్లా, శివ ప్రసాద్ ఆవుల, పెరుకు శివ రామ్ ప్రసాద్, రవి చైతన్య మైసా, భాస్కర్ రావు, సంతోష్ వర్మ మాదారపు, శశిధర్ రెడ్డి, విజయ మోహన్ వెంగళ, ప్రవీణ్ మామిడాల, సతీష్ పెసరు, మణికంఠ రెడ్డి మొదలగు వారు భక్తులందరికీ ధన్యవాదాలు తెలిపారు. 

భారత్ నుండి ఈ పవిత్ర అక్షింతలను సింగపూర్‌కు చేర్చడంలో ముఖ్య పాత్ర పోషించిన గోనె నరేందర్ రెడ్డికి సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. అదేవిధంగా శ్రీరామ ఆలయ అధికారులు మాట్లాడుతూ.. ఈ ఆలయంలో ఇటువంటి పుణ్య కార్యక్రమం నిర్వహించడం ఎన్నో జన్మల పుణ్యఫలం అని తెలుపుతూ వారి ఆనందాన్ని వ్యక్తం చేశారు.

(చదవండి: అయోధ్యలో రామ్‌లల్లా విగ్రహ ప్రతిష్ఠాపన: డల్లాస్‌లో పండుగ వాతావరణం! )

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement