గుడి మల్కాపూర్ మార్కెట్‌లో పూలు కొనుగోలు చేస్తున్న మహిళలు
సాక్షి సిటీబ్యూరో: ఈ ఏడాది శివరాత్రి పుర్వదినం సందర్భంగా నగరంలో గతంలో ఎన్నడూ లేని విధంగా రికార్డు స్థాయిలో పూలు పండ్లు హోల్‌సేల్ విక్రయాలు జరిగాయి. గడ్డిఅన్నారం పండ్ల మార్కెట్, గుడిమల్కాపూర్, జామ్‌బాగ్ మార్కెట్లు వినియోగదారులతో కళకళలాడాయి. మార్కెట్ ఎ ంత మొత్తంలో ఎప్పుడూ పండ్లు రాలేదని, పూలు కూడా రికార్డు స్థాయిలో విక్రయాలు జరిగాయని మార్కెట్ ఆధికారులు తెలిపారు. శివరాత్రి రోజున ఎక్కువ శాతం మంది ఉపవాసాలు చేసి పండ్లు ఆరగిస్తారు. మిగితా రోజుల్లో దాదాపు ఎనిమిది 800 టన్నుల పండ్లు దిగుమతి అయితే శివరాత్రి సందర్భంగా 1,800 టన్నుల వివిధ రాకల పండ్లు దిగుమతి కాగా పూలు 10 టన్నుల వరకు దిగు మతి అయ్యాయని మార్కెట్ కార్యదర్శి వివరించా రు. గ్రేటర్ పరిధిలో శివరాత్రి పండగ రోజు దా దా పు 1500 టన్నుల వివిధ రకాల పండ్ల విక్రయాలు జరుగుతాయని మార్కెట్ అధికారుల అం చనా. ప్రస్తుతం ఎండలు పెరగడంతో పుచ్చకాయ , సం త్రా, మొసాంబి, ద్రాక్ష, దానిమ్మ పండ్లకు దిగుమ తి పెరిగిందని హోల్‌సెల్ వ్యాపారులు తెలిపారు.
రికార్డు స్థాయిలో పండ్లు, పూలు
గతంతో పోలిస్తే ఈ ఏడాది పూల దిగుమతి మూడొంతులు, పండ్లు రెండింతలు ఎక్కువగా దిగుమతి అయ్యాయి. పూలు 40 టన్నులు, పండ్లు 1500 టన్నులు మార్కెట్‌కు వచ్చాయి. దాదాపు పూల వ్యాపారం రూ.1.50 కోట్లు, పండ్లు రూ.20 కోట్ల మేరకు వ్యాపారం జరిగిందని అంచనా.
హోల్‌సేల్ ధరలు యథాతథం
ఈ ఏడాది పండ్ల దిగమతి ఎక్కువగా ఉండడంతో ధరలు అంతగా పెరగలేదు. శివరాత్రి సందర్భంగా రెండింతలు పండ్లు దిగుమతి అయ్యాయి. అయినా గతేడాది ఉన్న ధరలే హోల్‌సేల్ ధరలున్నాయి. పుచ్చకాయ, మొసాంబి, సంత్రా గతేడాది కంటే ఎక్కువగా దిగుమతి అవుతున్నాయి. దీంతో గతేడాది కంటే పండ్ల ధరలు కాస్త తక్కువగానే ఉన్నాయని అధికారులు చెప్పారు.
బహిరంగ మార్కెట్‌లో పెరిగిన రిటైల్ ధరలు
పూలు, పండ్ల ధరలు హోల్‌సేల్ మార్కెట్‌లో ఎక్కువగా పెరగలేదు. అయితే బహిరంగ మార్కెట్‌లో ధరలు భగ్గుమన్నాయి. ముఖ్యంగా శివరాత్రి రోజు వివిధ రకాల పండ్లు భక్తులు తప్పనిసరిగా ఉపవాస ప్రసాదంగా స్వీకరిస్తారు. దీన్ని ఆసరాగా చేసుకొని రిటేల్ వ్యాపారులు బహిరంగ మార్కెట్‌లో పండ్ల ధరలను రెండింతలు పెంచి విక్రయించారు. దీంతో గత్యంతరం లేక ఎక్కువ డబ్బులు చెల్లించి నగర ప్రజలు కొనాల్సి వచ్చింది. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది పండ్లు కిలోగా అభ్య మైయ్యే వాటిపై రూ.10 నుంచి రూ.20 వరకు పెంచారు. విడివిడిగా విక్రయించే వాటిపై కూడా రూ. 5 నుంచి రూ. 10 వరకు ధరలు పెరిగాయి.
ప్రత్యేక ఏర్పాట్లు చేశాం
ప్రతి ఏటా శివరాత్రికి ముందు నగరంతో పాటు శివారు జిల్లాల నుంచి హోల్‌సేల్ వ్యాపారులు పండ్లు కోనుగోలు కోసం పెద్దు ఎత్తున మార్కెట్‌కు వస్తారు. రెండు మూడు రోజుల ముందు నుంచే మార్కెట్‌కు వచ్చే వారికి ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా అన్ని రకాల ఏర్పాట్లు చేశాము. వివిధ జిల్లాలు, రాష్ట్రాల నుంచి వచ్చే వాహనాలతో ట్రాఫిక్ జామ్ కాకుండా చర్యలు తీసుకున్నాం. ఇదే సమయంలో మార్కెట్‌కు మార్కెట్ ఫీజులు ఎప్పటికప్పుడు వసూలు చేసి అదాయం పెంచడానికి ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నాం. – గడ్డిఅన్నారం వ్యవసాయ మార్కెట్ సొసైటీ ఉన్నత శ్రేణి కార్యదర్శి ఇ. వెంకటేశం
రైతులకు మద్దతు ధర దక్కేలా చర్యలు
పలు జిల్లాల నుంచి బంతి, చామంతితో పాటు ఇతర పువ్వులు ఎక్కువ మొత్తం లో మార్కెట్‌కు వచ్చాయి. రోజు కంటే అదివారం మూడింతలు పూలు వచ్చాయి. రైతులకు తా త్కాలిక స్థలాలను కేటాయించాం. రైతులు ధర విషయంలో మోసపోకుండా మద్ధతు ధర నిర్ణయించాం. – కె. శ్రీధర్, గుడిమల్కాపూర్ వ్యవసాయ మార్కెట్ సొసైటీ స్పెషల్ గ్రేడ్ కార్యదర్శి
Comments
Please login to add a commentAdd a comment