Flower market
-
పూల ధర.. జేబులదర..
ఆలమూరు: తెలుగు రాష్ట్రాల్లో ప్రసిద్ధి చెందిన కడియపులంక పూల మార్కెట్ శ్రావణ శోభతో కళకళలాడుతోంది. పూల దిగుబడికన్నా డిమాండ్ అధికంగా ఉండటంతో ధరలు మూడింతలు పెరిగాయి. వాతావరణ పరిస్థితుల ప్రభావం వల్ల కొంతకాలంగా ఇబ్బందులు పడుతున్న పూల రైతులకు ప్రస్తుత ధరలు ఆశాజనకంగా కనిపిస్తున్నాయి. వరలక్ష్మి వ్రతం, వినాయక చవితి, విజయ దశమి, దీపావళి వంటి వరుస శుభకార్యాలు, నాలుగు నెలల పాటు వివాహాలు ఉండటంతో మార్కెట్ సందడిగా మారింది. అన్ని రకాల పూలకూ డిమాండ్కడియపులంక పూల మార్కెట్లో అన్ని రకాల పూలకు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. చామంతి, మల్లి, జాజులు, లిల్లీ రైతులకు ప్రస్తుత ధరలు సిరుల్ని కురిపిస్తున్నాయి. నెల రోజుల వ్యవధిలోనే పూల ధరలు మూడు రెట్లు పెరిగినా.. తోటలు ఖాళీ అవడంతో చాలామంది రైతులు నిరుత్సాహానికి గురవుతున్నారు. జిల్లాలో సాగు చేస్తున్న కొత్త రకం చామంతి పూలకు ఎండలను తట్టుకునే శక్తి ఉండటంతో జిల్లాలో కొంతమేర పూల దిగుబడి ఆశాజనకంగా ఉంది. వాతావరణ మార్పుల ప్రభావంతో పూల తోటలు ఎండిపోయి దిగుబడి గణనీయంగా పడిపోతోంది. దీంతో స్థానికంగా పండించే పూలు అవసరాలకు సరిపోని పరిస్థితి ఏర్పడింది.దిగుమతుల వల్లే..ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని నదీ పరీవాహక ప్రాంతాల వెంబడి సుమారు 5 వేల ఎకరాల్లో వివిధ రకాల పూల సాగు జరుగుతోంది. రైతులు పండించిన పూలను కడియపులంక పూల మార్కెట్‌కు తరలించి విక్రయాలు జరుపుతారు. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో కడియం, ఆలమూరు, ఆత్రేయపురం, రాజమహేంద్రవరం రూరల్, సీతానగరం, కె.గంగవరం, కపిలేశ్వరపురం మండలాల నుంచి నిత్యం సుమారు 20 టన్నుల పూలు కడియపులంక మార్కెట్‌కు వస్తుంటాయి. ఇదే సమయంలో ఇతర రాష్ట్రాలకు, జిల్లాలకు ఎగుమతులు జరుగుతుండటంతో పూల కొరత ఏర్పడుతోంది. దీంతో మార్కెట్ డిమాండ్‌ను అనుసరించి కడియపులంక హోల్‌సేల్ వ్యాపారులు బెంగళూరు, చెన్నై, మహారాష్ట్ర నుంచి వివిధ రకాల పూలను దిగుమతి చేసుకుంటున్నారు. దీనికితోడు వరుస శుభకార్యాలు, దిగుమతుల ప్రభావంతో పాటు రవాణా ఖర్చులు పెరిగిపోవడంతో పూల ధర పెరిగిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.అలంకరణ పూలకు భలే డిమాండ్శుభకార్యాల్లో అలంకరణకు ఉపయోగించే జర్బరా పూలకు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. కల్యాణ వేదికలకు అవసరమయ్యే పూలు స్థానికంగా అందుబాటులో లేకపోవడంతో బెంగళూరు, ఊటీ ప్రాంతాల నుంచి దిగుమతి చేసుకుంటున్నారు. ఇప్పటివరకూ రూ.40 పలికిన పది పూల కట్ట ధర ప్రస్తుతం రూ.110కి చేరింది. వివాహ, శుభకార్యాల వల్ల మంటపాలు అలంకరించే వారు జిల్లా నలుమూలల నుంచి భారీ స్థాయిలో ఆర్డర్లు పెడుతున్నారు. దీంతో డెకరేషన్ పూల ధరలు విపరీతంగా పెరిగిపోయాయి.ధర ఆశాజనకంఈ సీజన్లో అన్ని రకాల పూల ధరలు ఆశాజనకంగా ఉన్నాయి. జిల్లాలో పూల దిగుబడి తగ్గడంతో మార్కెట్‌కు రికార్డు స్థాయిలో ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతులు జరుగుతున్నాయి. ప్రస్తుతం శుభ ముహూర్తాలు వరుసగా రావడంతో పూల ధరలు ఇంచుమించు ఇదే విధంగా ఉండే అవకాశం ఉంది. – సాపిరెడ్డి సత్తిబాబు, పూల వ్యాపారి, కడియపులంకచామంతి సాగుతో లాభాలు ఇప్పటివరకూ అంతంత మాత్రంగానే ఉన్న పూల సాగు ప్రస్తుతం లాభాలను తెచ్చిపెడుతోంది. వరుసగా వివాహాలు, పండుగలు ఉండటంతో పూల ధర ఇదే విధంగా కొనసాగే అవకాశం ఉందని ఆశిస్తున్నాం. – మందపల్లి శ్రీధర్, ఉద్యాన రైతు, బడుగువానిలంక -
వామ్మో! ఆ దేశం కేవలం పూల వ్యాపారంతోనే.... రూ.180 కోట్ల ఆదాయాన్ని ఆర్జిస్తుందటా!!
ఆసియాలోని అతిపెద్ద పూల మార్కెట్ అయిన చైనా పూల మార్కెట్ రోజుకి వేలాదిమంది కస్టమర్ల ఆర్డర్లతో కళకళలాడుతుంది. ఇ-కామర్స్ అనేది చైనాలో అతి పెద్ద వ్యాపారం. అయితే ఇంతవరకు ఆన్లైన్లో సౌందర్య సాధనాలకు సంబంధించిన లగ్జరీ బ్రాండ్ల విక్రయాలతో శరవేగంగా దూసుకుపోయింది. కానీ ఇప్పడూ మాత్రం అనుహ్యంగా ఆన్లైన్ పూల మార్కెట్ మంచి ఆదాయ వనరుగా శరవేగంగా పుంజుకుంటుంది. అంతేకాదు ప్రజలంతా తమ స్మార్ట్ ఫోన్ల సాయంతో ఆన్లైన్లో తమకు నచ్చిన పూల బోకేలను లేదా పూలను ఆర్డర్ చేసేందుకు ఆసక్తి చూపుతున్నట్లు చైనా పేర్కొంది. (చదవండి: అందరూ!....వెక్కిరించి అవమానించే ఏకైక వైకల్యం...నత్తి!!) పైగా చైనా దేశం తమ ఉద్యాన పరిశ్రమ ఆదాయం సుమారు 160 బిలియన్ యువాన్ల (రూ.180 కోట్లు) గా అంచనా వేసింది. అంతేకాదు ఈపూల మార్కెట్‌కి సంబంధించిన ఆన్లైన్ రిటైల్ ఇప్పుడు సెక్టార్ టర్నోవర్‌లో సగానికి పైగా ప్రాతినిధ్యం వహిస్తోంది. ఈ మేరకు ఐదు పుష్పగుచ్ఛాలు, వెంటనే ఆర్డర్ చేసే వారికి కేవలం 39.8 యువాన్లు (రూ.468) మాత్రమే అంటూ చక్కటి ఆకర్షించే ఆఫర్లతో కస్టమర్లను మైమరిపించి కొనేలా చేస్తుంది. దీంతో ఆయా ఆన్లైన్ వ్యాపారా సంస్థలకు సంబంధించిన తమ రోజు వారి ఆదాయాలు మారుతూ వస్తున్నాయి. అంతేకాదు చైనాలో జీవన ప్రమాణాలు పెరగడం వల్ల కట్ ఫ్లవర్‌లకు డిమాండ్ పెరగడంతో దక్షిణ ప్రావిన్స్ యునాన్ ఆ విజృంభణకు కేంద్రంగా మారింది. పైగా ప్రాంతీయ రాజధాని కున్మింగ్ ఆసియాలోనే అతిపెద్ద పూల మార్కెట్‌ను కలిగి ఉంది. పైగా నెదర్లాండ్స్‌లోని ఆల్స్మీర్ తర్వాత ఇదే ప్రపంచంలో రెండవ అతిపెద్దది పూల మార్కెట్. గతేడాది కరోనా మహమ్మారి కారణంగా స్థంభించిపోయిన ఈ పూల మార్కెట్ ప్రస్తుతం ఈ ఆన్లైన్ విక్రయాలతో ఒక్కసారిగా ఊపందుకుంది. ఈ మేరకు ప్రజలు కూడా ఈ మహమ్మారీ భయంతో ఆన్లైన్లోనే విక్రయించేందుకు ఆసక్తి చూపుతున్నటు చైనా వ్యాపార నిపుణులు చెబుతున్నారు. అంతేకాదు ప్రతిరోజూ సగటున నాలుగు మిలియన్ల కంటే ఎక్కువ పువ్వులు అమ్ముడవుతున్నాయని, పైగా చైనా ఒక్క వాలెంటైన్స్ డే రోజునే దాదాపు 9.3 మిలియన్లను విక్రయిస్తుందని అంటున్నారు. (చదవండి: దేశంలో డ్రైవింగ్ లైసెన్స్ పొందిన తొలి మరుగుజ్జు వ్యక్తి మనోడే!) -
వరలక్ష్మీ వ్రతం.. కొండెక్కిన పూలు !
వన్‌టౌన్(విజయవాడ పశ్చిమ): వరలక్ష్మీ వ్రతాన్ని పురస్కరించుకొని నగరంలో పూల ధరలు గురువారం చుక్కలనంటాయి. కరోనా వైరస్ ఉధృతి కొనసాగుతున్నా నగరవాసులు ఏమాత్రం భయపడకుండా మార్కెట్‌కు పోటెత్తారు. దాంతో పూల ధరలు అమాంతం పెరిగిపోయాయి. శ్రావణ శుక్రవారం అందులోనూ వరలక్ష్మీ వ్రతం కావడంతో ఇళ్లలో ప్రత్యేక పూజలు, ఇతర వ్రతాలను నిర్వహించుకోవడం ఆనవాయితీ. ఆ క్రమంలో గురువారం మార్కెట్‌కు వెళ్లిన నగర వాసులకు ఆయా ధరలు చూసి ఒక్కసారిగా మూర్చపోయినంత పనైయింది. ముఖ్యంగా నగరంలోని రాజీవ్‌గాంధీ హోల్‌సేల్ పూల మార్కెట్లో కిలో కనకాంబరాలు రూ.1000 పలకగా రెండు రోజుల క్రితం అవే పూలు కేవలం రూ.500 మాత్రమే పలికింది. వరలక్ష్మీ వ్రతాన్ని పురస్కరించుకొని కనకాంబం ధర ఐదు రెట్లు పెరిగింది. పూలధరలకు రెక్కలు మల్లెపూలు మంగళవారం కిలో రూ.200 ఉండగా గురువారం రూ.600 పలికింది. అదేవిధంగా సన్నజాజులు కూడా రూ.200 నుంచి 600 లకు పెరిగింది. అలాగే చామంతి పూలు గురువారం రూ. 300 నుంచి 400 వరకు విక్రయించారు. బంతిపూలు రూ.150, గులాబీ కిలో రూ.300, లిల్లీ రూ.200, హైబ్రీడ్ గులాబీ రూ.100 నుంచి 200 చొప్పున పలికాయి. వాటితో పాటుగా బెంగళూరు నుంచి వచ్చే గులాబీ 20 పూల కట్ట రూ.200 పలికింది. అదేవిధంగా దండల ధరలు సైతం అమాంతం కొండెక్కి కూర్చున్నాయి. కరోనాను సైతం లెక్కచేయని వైనం.. నగరంలో కరోనా లాక్డౌన్ పరిస్థితులు కొనసాగుతున్నా వాటిని ప్రజలు ఏమాత్రం పట్టించుకోవటం లేదు. కనీసం భౌతిక దూరం కూడా పాటించకుండా మార్కెట్లకు తరలివస్తున్నారు. పూలమార్కెట్లో కనీసం అడుగు దూరం కూడా పాటించకుండా ఒకరినొకరు తోసుకుంటూ మరీ పూలు కొనుగోలు చేశారు. గత ఏడాది సాధారణ పరిస్థితుల్లో మార్కెట్ ఎలా ఉందో అదేవిధంగా గురువారం కూడా పూలమార్కెట్ దర్శనమిచ్చింది. పండ్ల ధరలు సైతం పైపైనే.. మార్కెట్లో పండ్ల ధరలకు సైతం ఒక్కసారిగా రెక్కలొచ్చాయి. వరలక్ష్మీ వ్రతం రోజున మహిళలు వాయినాలు ఇవ్వడం పరిపాటి. అందులో ఒకటీ, రెండు పండ్లు జతచేసి వాయినాలు ఇవ్వడం ఆనవాయితీ. అందులో భాగంగా వాటిని కొనుగోలు చేయడానికి వచ్చిన మహిళలు వాటి ధరలు చూసి అవాక్కయ్యారు. బుధవారం సాధారణ అరటిపండ్లు డజను రూ.35కు విక్రయించగా వాటిని గురువారం రూ.60కు తక్కువ లేదంటూ వ్యాపారులు తెగేసి చెప్పి మరీ విక్రయాలు చేశారు. అలాగే ద్రాక్ష సాధారణ రోజుల్లో రూ.100 పలికితే గురువారం రూ.140లుగా వినిపించింది. అదేవిధంగా బత్తాయి, దానిమ్మ, జామ, యాపిల్ ధరలు కూడా సామాన్యులకు అందుబాటులో లేకుండా పోయాయి. కిటకిటలాడిన నగర మార్కెట్లు నగరంలోని పండ్లు, పూలు, ఇతర పూజా సామగ్రి విక్రయించే మార్కెట్లు కిటకిటలాడాయి. కనీసం అడుగుతీసి అడుగు వేయడానికి కూడా ఖాళీ లేకుండా వినియోగదారులు ఆయా మార్కెట్లకు పోటెత్తారు. ముఖ్యంగా వన్‌టౌన్‌లోని రాజీవ్‌గాంధీ హోల్‌సేల్ మార్కెట్లో లోపలకు వెళ్లేందుకు ఒక్కొక్కరికి కనీసం పావుగంటకు పైగా సమయం పట్టిందంటే రద్దీ ఎంతగా ఉన్నదో అర్ధం చేసుకోవచ్చు. అలాగే కాళేశ్వరరావు మార్కెట్ సెంటర్, బీసెంట్‌రోడ్డు తదితరప్రాంతాల్లో సైతం పండ్ల, పూల మార్కెట్లకు నగరవాసులు పోటెత్తారు. మార్కెట్ల రద్దీ కారణంగా ఆయా ప్రాంతాల్లో పాదచారుల రాకపోకలకు ఇబ్బ ందులు ఏర్పడ్డాయి. అంతేకాకుండా పలు మార్లు ట్రాఫిక్ స్తంభించింది. మళ్లీ కళకళ.. శ్రావణ శుక్రవారం, బక్రీద్ పర్వదినాల నేపథ్యంలో విజయవాడలో వస్త్ర, బంగారం దుకాణాలు కళకళలాడాయి. ఇప్పటివరకు కోవిడ్ కారణంగా వెలవెలబోయిన దుకాణాలు కస్టమర్లతో నూతన శోభతో కనిపించాయి. కరోనా ముందు పరిస్థితులు మళ్లీ కళ్లముందు కదలాడాయి. ఏ దుకాణంలో చూసినా కొనుగోలు దారులు కనిపించారు. వ్యాపారులు సైతం ఆశ్చర్యానందానికి లోనయ్యారు. తగిన జాగ్రత్తలు పాటిస్తూ విక్రయాలు జరిపారు.– సాక్షి ఫొటోగ్రాఫర్, విజయవాడ -
పూల మార్కెట్‌పై కరోనా ప్రభావం
-
పండగకు పోటెత్తిన పూలు
సాక్షి, హైదరాబాద్: దసరా పండగ నేపథ్యంలో నగరానికి పూలు పోటెత్తాయి. గత వారమంతా బతుకమ్మ సందడి, నవరాత్రలతో పూలకు గిరాకీ బాగా ఉండగా...దసరాకు అది మరింత పెరిగింది. దీంతో గ్రేటర్ శివారు జిల్లాలతోపాటు పొరుగు రాష్ట్రాల నుంచి సైతం నగరానికి పూలు దిగుమతి అవుతున్నాయి. ముఖ్యంగా బంతి, చామంతి, గులాబీ పూలతోపాటు డెకరేషన్‌కు ఉపయోగించే పూలకు డిమాండ్ బాగా ఉంది. దసరాకు ఆయుధపూజలు నిర్వహించడంతోపాటు వాహనాలు, షాపులు, వివిధ సంస్థలను పూలతో అలంకరించడం ఆనవాయితీ. ఈ నేపథ్యంలోనే పూల విక్రయాలు పెరిగాయి. ఈసారి పొరుగు రాష్ట్రాల నుంచి కూడా గులాబీ, చామంతి, బంతితో పాటు ఇతర పూలు ఎక్కువ మొతాదులో మార్కెట్‌కు వచ్చాయని మార్కెట్ అధికారులు తెలిపారు. సోమవారం గడ్డిఅన్నారం మర్కెట్‌కు బంతి సుమారు 2 వేల క్వింటాళ్లు, చామంతి 800 క్వింటాళ్లు దిగుమతి అయ్యాయని మార్కెట్ వర్గాల అంచనా. గతంలో ఎన్నడూ లేని విధంగా కనకాంబరం పూల ధర రికార్డు స్థాయిలో కిలో రూ.1500 పలికిందని మార్కెట్ అధికారులు చెప్పారు. గతేడాదితో పోలిస్తే బంతి పూలు రికార్డు స్థాయిలో విక్రయాలు జరిగినట్లు అంచనా. బంతిపూల ధరలు తక్కువగా ఉండడంతో జనం ఇతర పూల కంటే వీటినే ఎక్కువగా కొనుగోలు చేశారు. దిగుమతులు అధికమవడం వల్లే బంతి పూల ధరలు తగ్గాయని వ్యాపారులు, రైతులు అంటున్నారు. గత ఏడాది బంతి రూ.50 నుంచి 80 రూపాయలు ధర పలికితే...ఈ ఏడాది రూ.50–30 మధ్యే ధరలు ఉన్నాయంటున్నారు. దీంతో తమకు పెట్టుబడి ఖర్చులు కూడా రావడం లేదని రైతులు వాపోయారు. కేవలం కనకాంబరాల దిగుమతి తక్కువగా ఉండడం వల్లే రేటు బాగా పలికిందన్నారు. రైతులకు గిట్టుబాటయ్యేలా చర్యలు గతేడాది బంతి పూల ధర కిలో రూ.50 లోపే ఉండగా...చామంతి ధర అత్యధికంగా రూ.100 ఉంది. ఈ ఏడాది శివారు జిల్లాలతో పాటు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర నుంచి ఎక్కువ మోతాదులో ప్రత్యేకంగా బంతి, చామంతి, సెంట్‌గులాబీ, కాగడాలు, లిల్లీ తదితర రకాల పూలు దిగుమతి అయ్యాయి. డిమాండ్‌కు సరిపడ దిగుమతులు ఉంటే ధరలు సర్వసాధారణంగా పెరగవు. డిమాండ్‌కు తక్కువగా దిగుమతులు ఉంటే ధరలు పెరుగుతాయి. ధరలు మరింత పడిపోకుండా నియత్రించడానికి ప్రయత్నించాం. రైతులకు గిట్టుబాటు ధరలు అందేలా చర్యలు తీసుకున్నాం. రైతులకు ఇబ్బందులు కలుగకుండా అన్ని రకాల ఏర్పాట్లు చేశాం. కె. శ్రీధర్, స్పెషల్ గ్రేడ్ కార్యదర్శి, గుడిమల్కాపూర్ మార్కెట్ -
మార్కెట్‌కు శివరాత్రి కళ
సాక్షి సిటీబ్యూరో: ఈ ఏడాది శివరాత్రి పుర్వదినం సందర్భంగా నగరంలో గతంలో ఎన్నడూ లేని విధంగా రికార్డు స్థాయిలో పూలు పండ్లు హోల్‌సేల్ విక్రయాలు జరిగాయి. గడ్డిఅన్నారం పండ్ల మార్కెట్, గుడిమల్కాపూర్, జామ్‌బాగ్ మార్కెట్లు వినియోగదారులతో కళకళలాడాయి. మార్కెట్ ఎ ంత మొత్తంలో ఎప్పుడూ పండ్లు రాలేదని, పూలు కూడా రికార్డు స్థాయిలో విక్రయాలు జరిగాయని మార్కెట్ ఆధికారులు తెలిపారు. శివరాత్రి రోజున ఎక్కువ శాతం మంది ఉపవాసాలు చేసి పండ్లు ఆరగిస్తారు. మిగితా రోజుల్లో దాదాపు ఎనిమిది 800 టన్నుల పండ్లు దిగుమతి అయితే శివరాత్రి సందర్భంగా 1,800 టన్నుల వివిధ రాకల పండ్లు దిగుమతి కాగా పూలు 10 టన్నుల వరకు దిగు మతి అయ్యాయని మార్కెట్ కార్యదర్శి వివరించా రు. గ్రేటర్ పరిధిలో శివరాత్రి పండగ రోజు దా దా పు 1500 టన్నుల వివిధ రకాల పండ్ల విక్రయాలు జరుగుతాయని మార్కెట్ అధికారుల అం చనా. ప్రస్తుతం ఎండలు పెరగడంతో పుచ్చకాయ , సం త్రా, మొసాంబి, ద్రాక్ష, దానిమ్మ పండ్లకు దిగుమ తి పెరిగిందని హోల్‌సెల్ వ్యాపారులు తెలిపారు. రికార్డు స్థాయిలో పండ్లు, పూలు గతంతో పోలిస్తే ఈ ఏడాది పూల దిగుమతి మూడొంతులు, పండ్లు రెండింతలు ఎక్కువగా దిగుమతి అయ్యాయి. పూలు 40 టన్నులు, పండ్లు 1500 టన్నులు మార్కెట్‌కు వచ్చాయి. దాదాపు పూల వ్యాపారం రూ.1.50 కోట్లు, పండ్లు రూ.20 కోట్ల మేరకు వ్యాపారం జరిగిందని అంచనా. హోల్‌సేల్ ధరలు యథాతథం ఈ ఏడాది పండ్ల దిగమతి ఎక్కువగా ఉండడంతో ధరలు అంతగా పెరగలేదు. శివరాత్రి సందర్భంగా రెండింతలు పండ్లు దిగుమతి అయ్యాయి. అయినా గతేడాది ఉన్న ధరలే హోల్‌సేల్ ధరలున్నాయి. పుచ్చకాయ, మొసాంబి, సంత్రా గతేడాది కంటే ఎక్కువగా దిగుమతి అవుతున్నాయి. దీంతో గతేడాది కంటే పండ్ల ధరలు కాస్త తక్కువగానే ఉన్నాయని అధికారులు చెప్పారు. బహిరంగ మార్కెట్లో పెరిగిన రిటైల్ ధరలు పూలు, పండ్ల ధరలు హోల్‌సేల్ మార్కెట్లో ఎక్కువగా పెరగలేదు. అయితే బహిరంగ మార్కెట్లో ధరలు భగ్గుమన్నాయి. ముఖ్యంగా శివరాత్రి రోజు వివిధ రకాల పండ్లు భక్తులు తప్పనిసరిగా ఉపవాస ప్రసాదంగా స్వీకరిస్తారు. దీన్ని ఆసరాగా చేసుకొని రిటేల్ వ్యాపారులు బహిరంగ మార్కెట్లో పండ్ల ధరలను రెండింతలు పెంచి విక్రయించారు. దీంతో గత్యంతరం లేక ఎక్కువ డబ్బులు చెల్లించి నగర ప్రజలు కొనాల్సి వచ్చింది. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది పండ్లు కిలోగా అభ్య మైయ్యే వాటిపై రూ.10 నుంచి రూ.20 వరకు పెంచారు. విడివిడిగా విక్రయించే వాటిపై కూడా రూ. 5 నుంచి రూ. 10 వరకు ధరలు పెరిగాయి. ప్రత్యేక ఏర్పాట్లు చేశాం ప్రతి ఏటా శివరాత్రికి ముందు నగరంతో పాటు శివారు జిల్లాల నుంచి హోల్‌సేల్ వ్యాపారులు పండ్లు కోనుగోలు కోసం పెద్దు ఎత్తున మార్కెట్‌కు వస్తారు. రెండు మూడు రోజుల ముందు నుంచే మార్కెట్‌కు వచ్చే వారికి ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా అన్ని రకాల ఏర్పాట్లు చేశాము. వివిధ జిల్లాలు, రాష్ట్రాల నుంచి వచ్చే వాహనాలతో ట్రాఫిక్ జామ్ కాకుండా చర్యలు తీసుకున్నాం. ఇదే సమయంలో మార్కెట్‌కు మార్కెట్ ఫీజులు ఎప్పటికప్పుడు వసూలు చేసి అదాయం పెంచడానికి ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నాం. – గడ్డిఅన్నారం వ్యవసాయ మార్కెట్ సొసైటీ ఉన్నత శ్రేణి కార్యదర్శి ఇ. వెంకటేశం రైతులకు మద్దతు ధర దక్కేలా చర్యలు పలు జిల్లాల నుంచి బంతి, చామంతితో పాటు ఇతర పువ్వులు ఎక్కువ మొత్తం లో మార్కెట్‌కు వచ్చాయి. రోజు కంటే అదివారం మూడింతలు పూలు వచ్చాయి. రైతులకు తా త్కాలిక స్థలాలను కేటాయించాం. రైతులు ధర విషయంలో మోసపోకుండా మద్ధతు ధర నిర్ణయించాం. – కె. శ్రీధర్, గుడిమల్కాపూర్ వ్యవసాయ మార్కెట్ సొసైటీ స్పెషల్ గ్రేడ్ కార్యదర్శి -
చోరీ నెపంతో వేధింపులు
► తల్లీ కూతుళ్లను వివస్త్రను చేసి అవమానించిన మార్వాడీ కుటుంబం ► యువతి అత్మహత్య ► మార్చురీ వద్ద దళిత సంఘాలు ధర్నా ► మృతదేహాన్ని పరిశీలించిన ► జిల్లా కలెక్టర్, ఎస్పీలు బళ్లారి (తోరణగల్లు) : నగరంలోని బెంగుళూరు రోడ్డులోని పూలమార్కెట్లో ఓ మార్వాడీ యజమాని ఇంట్లో ఉంగరాలు కనిపించ లేదని దళితులైన పని మనుషులను వేధించడంతో అవమానం భరించలేక ఓ యువతి ఆత్మహత్య చేసుకున్న ఘటన శనివారం వెలుగు చూసింది. బాధితుల బంధువుల వివరాలు... బండిమోట్ ప్రాంతానికి చెందిన ఎర్రెమ్మ (40), ఆమె కూతురు అంజలి (18)లు పూలమార్కెట్‌లోని చింటూ సేట్ ఇంట్లో పనిమనుషులుగా ఉన్నారు. ఇదిలా ఉంటే గత నెల 15న ఇంట్లో ఉంగరాలు కనిపించలేదని, వాటిని పనిమనుషులు అంజలి, ఎర్రెమ్మలు దొంగలించారనే నెపంతో చింటూ మరో ముగ్గురు వ్యక్తులు కలిసి యువతిని, ఆమె తల్లిని ఇద్దరినీ వివస్త్రలను చేసి ఉంగరాల కోసం శోధించారు. దీంతో అవమానం భరించలేక అంజలి ఇంట్లోనే ఒంటిపై కిరోసిన్ పోసుకొని నిప్పంటించుకుంది. వెంటనే పరిసర వాసులు గ మనించి మంటలను ఆర్పి బాధితురాలిని విమ్స్‌కు తరలించారు. ఈ ఘటనపై ఏపీఎంసీ పోలీసులు కేసు నమోదు చేసుకొని నిందితుల్లో ఒకరిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు అనంతరం బెయిల్‌పై విడుదలయ్యాడు. కాగా చికిత్స పొందుతూ అంజలి శనివారం మృతి చెందింది. దీంతో దళిత సంఘాల కార్యకర్తలు శనివారం మార్చురీ వద్ద నిరసన ప్రదర్శన చేపట్టారు. వేధింపులకు గురి చేసిన నిందితులను వెంటనే అరెస్ట్ చేయాలని, మృతురాలి తల్లికి పరిహారం చెల్లించి ప్రభుత్వోద్యోగం, పక్కా ఇళ్లు మంజూరు చేయాలనే డిమాండ్లతో నినాదాలు చేశారు. జిల్లా కలెక్టర్ సమీర్‌శుక్లా, ఎస్పీ చేతన్‌లు విమ్స్ మార్చురీ వద్దకు చేరుకొని మాట్లాడుతూ... నిందితుల్లో ఒకరిని ఇప్పటికే అదుపులోకి తీసుకోగా, బెయిల్‌పై బయటకొచ్చారు. మిగిలిన ముగ్గురి కోసం గాలిస్తున్నాము. చట్టం ప్రకారం నిందితుకు శిక్షపడే విధంగా చూస్తామని, మృతురాలి తల్లికి ప్రభుత్వంతో చర్చించి పరిహారం, పక్కాగృహం, ఉద్యోగం రావడానికి తమ వంతు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. అనంతరం అంజలి మృతదేహాన్ని పరిశీలించారు. -
విజయవాడ లో భారీ అగ్నిప్రమాదం
విజయవాడ రైల్వేస్టేషన్ సమీపంలోని రాజీవ్‌గాంధీ పూల మార్కెట్ వెనుక బస్తీలో బుధవారం మధ్యాహ్నం భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ సంఘటనలో రమాదేవి అనే మహిళ సజీవ దహనమైంది. 150 గుడిసెలు పూర్తిగా దగ్ధమయ్యాయి. భారీ ఆస్తి నష్టం జరిగింది. మధ్యాహ్నం అందరూ పనులకు వెళ్లిన సమయంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఇళ్లలోని రెండు గ్యాస్ సిలిండర్లు పేలడంతో మంటలు శరవేగంగా ఇతర ప్రాంతాలకు వ్యాపించాయి. 150 కుటుంబాలు సర్వం కోల్పోయి కట్టుబట్టలతో మిగిలారు. ఇంట్లో ఉన్న రమాదేవి అనే మహిళ బయటికి రాలేక మంటల్లో సజీవ దహనమైంది. మంటలను చూయి స్థానికులు పరుగులు తీశారు. 3 అగ్నిమాపక వాహనాలు వచ్చి మంటలను ఆర్పుతున్నాయి. మంటలు ఇంకా అదుపులోకి రాలేదు. ముందస్తు చర్యగా ఆ ప్రాంతంలో విద్యుత్ సరఫరాను ఆపేశారు. ఇళ్లలోని అందరూ పనులకు వెళ్లిన సమయంలో ప్రమాదం జరగడంతో పెద్దగా ప్రాణనష్టం జరగలేదు. పిల్లలందరూ పాఠశాలలకు వెళ్లారు. యితే నిరుపేద కుటుంబాలవారు సర్వశ్వం కోల్పోయారు. పూర్తి వివరాలు ఇంకా అందాల్సి ఉంది. -
పూల మార్కెట్లో అగ్నిప్రమాదం: 50 లక్షలు నష్టం
-
గులాబి@400, చామంతి@500
హైదరాబాద్ : రేపు శ్రావణ శుక్రవారం కావడంతో పూలు, పూజ సామాగ్రి కొనుగోళ్లలో మహిళలు మునిగిపోయారు. దీంతో పూల మార్కెట్ల వద్ద రద్దీ ఎక్కువైంది. ఇదే అదనుగా భావించిన పూల విక్రయదారులు పూల రేట్లను అమాంతం పెంచేశారు. గురువారం సాయంత్రం దిల్సుఖ్నగర్ కొత్తపేటలోని పూల మార్కెట్లో బంతిపూలు కిలో రూ.100కు , గులాబి కిలో రూ.400లు, చామంతి పూలు కిలో రూ.500లు పలుకుతుండటంతో మహిళలు అవాక్కవుతున్నారు. నిన్న మొన్నటి వరకు 50-60 రూపాయలు ఉన్న బంతిపూలు రూ.100కు కూడా లభించకపోవడంపై మహిళలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.