మంత్రికి కలశంతో స్వాగతం పలుకుతున్న అర్చకులు
దామరచర్ల (మిర్యాలగూడ) : లోక కల్యాణం కోసం మహా శివుడిని ప్రార్థించానని రాష్ట్ర విద్యుత్ శాఖా మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి తెలిపారు. మంగళవారం శివరాత్రి సందర్భంగా వాడపల్లిలోని పుణ్యక్షేత్రంలోని శ్రీమీనాక్షి అగస్త్యేశ్వర స్వామి, శ్రీలక్ష్మీ నరసింహ స్వామి దేవాలయాల్లో మంత్రి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మంత్రికి ఆలయ సాంప్రదాయాలకు అనుగుణంగా పూజారులు కలశంతో స్వాగతం పలికారు. అనంతరం ఆలయాల చరిత్రను మంత్రికి వివరించారు. ఈ సందర్భంగా మంత్రి విలేకరులతో మాట్లాడుతూ విస్తారంగా వర్షాలు కురియాలని, పంటలు పుష్కలంగా పండి రైతులు, ప్రజలు సుఖ శాంతులతో ఉండాలని శ్రీమీనాక్షి అగస్త్యేశ్వరుడికి పూజలు చేసినట్లు తెలిపారు. వాడపల్లి దేవాలయాల అభివృద్ధికి పాటుపడతానని అన్నారు.
అంతకుముందు మంత్రిని మిర్యాలగూడ నుంచి కార్యకర్తలు బైక్ ర్యాలీతో వాడపల్లి పుణ్యక్షేత్రానికి తోడ్కొని వచ్చారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్‌రావు, మాజీ ఎమ్మెల్యే విజయ సింహారెడ్డి, ఎంపీపీ కురాకుల మంగమ్మ, సింగిల్ విండో చైర్మన్ దుర్గంపూడి నారాయణరెడ్డి, మాజీ చైర్మన్ వీరకోటిరెడ్డి, చల్లా అంజిరెడ్డి, బాలాజీ, ఆర్డీఓ గోపాల్‌రావు, తహసీల్దార్ గణేష్, ఎంపీడీఓ ఉమాదేవి, సీఐ రమేష్‌బాబు, ఎస్‌ఐ రామన్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment