మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని దేశవ్యాప్తంగా ఉన్న శైవ క్షేత్రాలు భక్తుల శివనామస్మరణలతో మారుమ్రోగుతున్నాయి. తెల్లవారు జామునుంచే భక్తులు శివాలయాలకు పొటెత్తారు. బిల్వార్చనలు, క్షీరాభిషేకాలతో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. శ్రీకాళహస్తీ, శ్రీశైలం, వేములవాడ రాజన్న ఆలయాల్లో బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి.