అగ్నిగుండంలో తోపులాట; ఇద్దరి పరిస్థితి విషమం | Two Persons Injured Seriously In Furnace In Nalgonda | Sakshi
Sakshi News home page

అగ్నిగుండంలో తోపులాట; ఇద్దరి పరిస్థితి విషమం

Published Sat, Feb 22 2020 10:57 AM | Last Updated on Sat, Feb 22 2020 11:22 AM

Two Persons Injured Seriously In Furnace In Nalgonda - Sakshi

సాక్షి, నల్గొండ : నల్గొండ జిల్లా కేతేపల్లి మండలం గుడివాడ గ్రామంలో నిర్వహించిన అగ్నిగుండం కార్యక్రమంలో అపశృతి చోటుచేసుకుంది.  ప్రతి  ఏడాది శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని గ్రామంలోని పాత శివాలయం ద‍గ్గర కార్యక్రమాన్ని జరుపుతారు. ఈ నేపథ్యంలో అగ్నిగుండంలో నడస్తుండగా తోపులాట జరిగి ప్రమాదవశాత్తు ఆరుగురు భక్తులు అగ్నిగుండంలో పడిపోయారు. వారిలో ఇద్దరి భక్తుల పరిస్థితి విషమంగా ఉండడంతో ఆసుపత్రికి తరలించారు. అగ్నిగుండంలో నడుస్తుండగా భక్తులు ఒక్కసారిగా తోసుకోవడంతోనే ఈ ప్రమాదం చోటుచేసుకుందని గ్రామస్తులు పేర్కొన్నారు. 


 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement