persons injured
-
అగ్నిగుండంలో తోపులాట; ఇద్దరి పరిస్థితి విషమం
సాక్షి, నల్గొండ : నల్గొండ జిల్లా కేతేపల్లి మండలం గుడివాడ గ్రామంలో నిర్వహించిన అగ్నిగుండం కార్యక్రమంలో అపశృతి చోటుచేసుకుంది. ప్రతి ఏడాది శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని గ్రామంలోని పాత శివాలయం దగ్గర కార్యక్రమాన్ని జరుపుతారు. ఈ నేపథ్యంలో అగ్నిగుండంలో నడస్తుండగా తోపులాట జరిగి ప్రమాదవశాత్తు ఆరుగురు భక్తులు అగ్నిగుండంలో పడిపోయారు. వారిలో ఇద్దరి భక్తుల పరిస్థితి విషమంగా ఉండడంతో ఆసుపత్రికి తరలించారు. అగ్నిగుండంలో నడుస్తుండగా భక్తులు ఒక్కసారిగా తోసుకోవడంతోనే ఈ ప్రమాదం చోటుచేసుకుందని గ్రామస్తులు పేర్కొన్నారు. -
అగ్నిగుండం కార్యక్రమంలో అపశ్రుతి
-
చలిమంటల్లో పేలిన టపాసులు
పుంగనూరు: చలిమంటల్లో టపాకాయలు పేలి నలుగురికి తీవ్ర గాయాలైన సంఘటన చిత్తూరు జిల్లాలో చోటుచేసుకుంది. జిల్లాలోని పుంగనూరు మండలం జయనగర్‌లో ఆదివారం ఉదయం చలితీవ్రత ఎక్కువగా ఉండటంతో చలిమంట కాచుకుంటుండగా.. ఒక్కసారిగా మంటల్లో నుంచి పేలుడు సంభవించింది. దీంతో చలిమంట కాచుకుంటున్న నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. వారిని చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు. చలిమంటలో ప్రమాదవశాత్తు టపాకాయలు పడటంతో ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులకు స్థానికులు తెలిపారు. -
పాతబస్తీలో గ్యాంగ్‌వార్.. ఉద్రిక్తత
-
పాతబస్తీలో గ్యాంగ్‌వార్.. ఉద్రిక్తత
హైదరాబాద్: నగరంలోని పాతబస్తీ పరిధిలో గల ఆసిఫ్‌నగర్ మురాద్‌నగర్‌లో అర్ధరాత్రి తర్వాత ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఏదో విషయమై ఒకే ప్రాంతానికి చెందిన రెండు వర్గాల మధ్య వివాదం చెలరేగింది. ఈ క్రమంలో ఇరువర్గాలు రాళ్ల దాడికి పాల్పడ్డాయి. రెండు గ్యాంగ్‌లు తలపడిన ఈ గొడవలో 5 షాపులతో పాటు ఆరు కార్లు పాక్షికంగా ధ్వంసమయ్యాయని పోలీసులు తెలిపారు. మాటా మాటా పెరిగిపోవడంతో రెండు గ్యాంగ్‌లు రాత్రి ఒంటిగంట ప్రాంతంలో విచక్షణారహితంగా పరస్పర దాడులకు దిగాయి. ఈ వివాదంలో ఒక వర్గానికి చెందిన ఇద్దరు వ్యక్తులకు తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న అధికారులు మురాద్‌నగర్‌లో భద్రతను పెంచారు. ఆ ప్రాంతంలో పోలీసులను భారీగా మోహరించారు. ఘటనా స్థలాన్ని పరిశీలించారు. గొడవ తలెత్తడానికి గల కారణాలు, ఇతర వివరాలు తెలియాల్సి ఉంది.