GV Harsha Kumar
-
‘ట్విటర్ పక్షి’ని మాంచిగా వండి లాగించేసిన కాంగ్రెస్ నాయకులు
సామాజిక మాధ్యమం ‘ట్విటర్’ మీద ఉన్న కోపాన్ని కాంగ్రెస్ పార్టీ నాయకులు ఓ పక్షిపై చూయించారు. ఆ పక్షిని బలి తీసి ఉప్పుకారం మసాలాలు దట్టించి సలసల మాగే నూనెలో వేయించారు. అనంతరం ఆ మాంసాన్ని ట్విటర్ ప్రధాన కార్యాలయానికి పోస్టు చేశారు. ఇదంతా చేసింది రాహుల్ ఖాతాను ట్విటర్ నిలిపివేయడానికి నిరసనగా చేసిన ఈ కార్యక్రమం వైరల్‌గా మారింది. ఈ ఘటనను పలువురు ఖండిస్తుంటే.. మరికొందరు హర్షిస్తున్నారు. ఇంతకీ ఆ పక్షిని కాల్చి వండుకుతిన్నది ఎవరో కాదు ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఓ మాజీ ఎంపీ కుమారుడు, అతడి అనుచరులే. (చదవండి: ఎట్టకేలకు రాహుల్ ట్విటర్ ఖాతా పునరుద్ధరణ) రాహుల్‌గాంధీ ఖాతాను ట్విటర్ వారం నిషేధించిన అనంతరం పునరుద్ధరించింది. వరుసగా ఇదే పరిస్థితి ఏర్పడడంతో ఏపీకి చెందిన మాజీ ఎంపీ హర్షకుమార్ తనయుడు జీవీ శ్రీరాజ్ ట్విటర్ లోగోలో ఉండే పక్షి పిచ్చుక. ట్విటర్‌పై కోపంతో పిచ్చుకను కాల్చి మాంచిగా వండారు. ఫ్రై చేస్తూనే తాము ఎందుకు ఈ విధంగా చేస్తున్నామో తెలిపారు. ‘రాహుల్‌గాంధీ ట్విటర్ ఖాతా నిలుపుదల చేసి ట్విటర్ నిర్వాహకులు తప్పు చేశారు. కాంగ్రెస్ ట్వీట్లను ప్రమోట్ చేయడం లేదు. బీజేపీ చేసిన కుట్రతోనే ట్విటర్ కాంగ్రెస్ నాయకుల అకౌంట్లను బ్లాక్ చేసింది’ అని ఆ పార్టీ నాయకులు ఆరోపించారు. ఈ సందర్భంగా కార్యకర్తలు బీజేపీ డౌన్‌డౌన్ అని నినదించారు. ట్విటర్ ఇకనైనా తన తీరు మార్చుకోవాలని కాంగ్రెస్ శ్రేణులు హితవు పలికారు. చివరకు వండిన ఆ మాంసాన్ని ఒక డబ్బాలో పెట్టి గురుగ్రామ్‌లోని ట్విటర్ కార్యాలయానికి పంపుతున్నట్లు చెప్పారు. తపాలా కార్యాలయానికి వెళ్తున్నవరకు వీడియో ఉంది. అనంతరం వారు ఆ బాక్స్ పోస్టు చేశారు. చదవండి: ప్రేమించి పెళ్లాడి ఉగ్రవాదిగా మారిన భారత డెంటిస్ట్.. జైల్లోనే -
టీడీపీపై హర్షకుమార్ సంచలన ఆరోపణలు
సాక్షి, అమరావతి: తనను చంపేందుకు కుట్ర జరిగిందని మాజీ ఎంపీ జీవీ హర్షకుమార్ సంచలన ఆరోపణలు చేశారు. బుధవారం ఆయన రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి గోపాలకృష్ణ ద్వివేదిని కలిశారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ... ఐదేళ్లుగా ప్రజా సమస్యలపై పోరాటం చేసిన తనను తెలుగు దేశం పార్టీ ఎన్నో ఇబ్బందులకు గురి చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. సామాజిక న్యాయం కోసం ఇటీవల టీడీపీలో చేరినట్టు వెల్లడించారు. అమలాపురం ఎంపీ సీటు ఇస్తామని చెప్పి మొండిచేయి చూపడంతో టీడీపీ నుంచి బయటకు వచ్చానని తెలిపారు. తన కారు చక్రాల బోల్టులు తొలగించి తనను హత్య చేసేందుకు ప్రయత్నం జరిగిందని ఆరోపించారు. డీజీపీకి ఫిర్యాదు చేసినా విచారణ మాత్రం జరగడం లేదని వాపోయారు. పూర్తి స్థాయి దర్యాప్తు జరిగేలా చూడాలని ద్వివేదిని కోరానని చెప్పారు. ఇంటర్మీడియట్ కాలేజీల్లో అడ్డగోలుగా దోపిడీ చేస్తున్నారని హర్షకుమార్ మండిపడ్డారు. ఇంటర్ విద్యలో కార్పొరేట్ అనే పదం ఎక్కడా లేదని, కాలేజీల్లో ఎక్కడా నిబంధనలు పాటించడం లేదని ఆరోపించారు. ఇంటర్ ఫీజులపై న్యాయపోరాటం చేస్తున్నానని, హైకోర్టులో విచారణ జరుగుతోందన్నారు. ప్రభుత్వం నిర్దారించిన ఫీజు కేవలం రూ.2,800 మాత్రమేనని, ప్రోత్సాహకం పేరుతో ప్రభుత్వం 35 వేల ఫీజు కొంతమందికి ఎలా చెల్లిస్తుందని ఆయన ప్రశ్నించారు. ఫీజులు కట్టలేక తల్లిదండ్రులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. కాగా, ఇంటర్ కళాశాలల్లో ఫీజుల నియంత్రణపై హర్షకుమార్ దాఖలు చేసిన పిల్‌పై విచారణను ఈనెల 28కి హైకోర్టు వాయిదా వేసింది. -
పవన్‌కు దమ్ముంటే చెప్పాలి: హర్షకుమార్
సాక్షి, తూర్పు గోదావరి: తెలుగుదేశం పార్టీలో హర్షకుమార్ ముచ్చటగా అయిదు రోజులే... అమలాపురం మాజీ ఎంపీగా పని చేసిన హర్షకుమార్ కాంగ్రెస్‌కు రాజీనామా చేసి, ఇటీవలే చంద్రబాబు నాయుడు సమక్షంలో సైకిలెక్కారు. పార్టీలో చేరిక సందర్భంగా ఆయన...చంద్రబాబు నాయుడు కాళ్లు మొక్కడం హాట్ టాఫిక్‌గా మారింది. అయితే టికెట్ విషయంలో భంగపడిన హర్షకుమార్ తీవ్ర నిరాశకు గురై... కేవలం అయిదు రోజుల్లో ఆయన సైకిల్ ముచ్చట తీర్చేసుకున్నారు. హర్షకుమార్ చేరిక జిల్లాలో కలిసి వస్తుందనుకున్న టీడీపీకి ఆయన షాక్ ఇస్తూ ఆ పార్టీకి గుడ్‌బై చెప్పేశారు. ఈ ఎన్నికల్లో టీడీపీ తరఫున టికెట్ ఆశించిన హర్షకుమార్, ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో ఆ పార్టీలో చేరిన సంగతి తెలిసింది. అయితే టీడీపీ ప్రకటించిన జాబితాలో తన పేరు లేకపోవడంతో హర్షకుమార్ అసంతృప్తికి లోనయ్యారు. తాను టీడీపీకి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. టీడీపీ, జనసేన పార్టీలు రెండు ఒక్కటేనని ఆరోపించారు. జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌కు దమ్ముంటే టీడీపీతో పొత్తు లేదని దేవుడిపై ప్రమాణం చేయాలని సవాలు విసిరారు. జనసేన, కాంగ్రెస్, బీఎస్పీ, టికెట్లను టీడీపీ ఫిక్స్ చేస్తోందని వ్యాఖ్యానించారు. ఈసారి ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండాలనే నిర్ణయం తీసుకున్నారు. తన అనుచరులకు మాత్రం నచ్చిన పార్టీకి ఓటు వేసుకోండని ఆయన పిలుపునిచ్చారు. అయితే ఇటీవల టీడీపీలో చేరిన సమయంలో హర్షకుమార్, చంద్రబాబు కాలు పట్టుకోవడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. దీనిపై హర్షకుమార్ అభిమానులు, దళితులు, ప్రజా సంఘాలు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. సీటు కోసం ఇంతగా దిగజారాలా అని పెదవి విరిచారు. నెటిజన్లయితే హర్షకుమార్ తీరుపై పెద్ద ఎత్తున కామెంట్లు చేశారు. -
బలం లేనిచోట బరిలోకి దింపుతారా..!
సాక్షి, అమరావతి : ఎమ్మెల్యే, ఎంపీ స్థానాలకు నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైన నేపథ్యంలో పోటీకి దిగుతున్న అధికార టీడీపీ నేతల్లో గుబులు మొదలైంది. టీడీపీ ఓటమి ఖాయమన్న చోట సీట్లిచ్చారని పలువురు అసహనం వ్యక్తం చేస్తున్నారు. తమ సామాజిక వర్గం ఎక్కువగా లేని చోట బలవంతంగా బరిలోకి దింపుతున్నారని ఆ పార్టీ ఎంపీ అభ్యర్థులు శిద్ధా రాఘవరావు, బీద మస్తాన్‌రావు, సత్యప్రభ, వి. శివరామరాజు ఆవేదనలో ఉన్నట్టు తెలుస్తోంది. ఇక బీసీలకు అది చేస్తాం.. ఇది చేస్తాం అని అరిగిపోయిన రికార్డులు ప్లే చేసే చంద్రబాబు సీట్ల కేటాయింపులో వారికి తగిన ప్రాధాన్యం ఇవ్వలేకపోయారు. ప్రతిపక్ష పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బీసీలకు 7 ఎంపీ సీట్లు కేటాయించగా.. టీడీపీ మాత్రం 5 సీట్లే ఇచ్చింది. బీసీలు అత్యధికంగా ఉన్న రాజమండ్రి, విజయనగరం, కర్నూలు ఎంపీ సీట్లను బీసీలకు కాకుండా అగ్రవర్ణ నేతలకు కేటాయించారని పార్టీ శ్రేణులు చంద్రబాబు తీరుపై ఆందోళన వ్యక్త చేస్తున్నాయి. అశోక్ గజపతిరాజు-విజయనగరం, కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి-కర్నూలు, మాగంటి రూప-రాజమండ్రి నుంచి పోటీ చేస్తున్నారు. మాజీ ఎంపీకి షాకిచ్చిన బాబు.. నిన్నటి వరకు కాంగ్రెస్‌లో ఉండి చంద్రబాబును ఏకిపారేసిన అమలాపురం మాజీ ఎంపీ జీవీ హర్షకుమార్ టీడీపీలో చేరారు. అయితే, ఎంపీ టికెట్ హామీతో పచ్చపార్టీలో చేరిన హర్షకుమార్కు బాబు షాకిచ్చారు. ఆయనకు ఎటువంటి టికెట్ కేటాయించలేదు. అమలాపురం టికెట్‌ను గంటి హరీష్‌కు కేటాయించారు. ఇక టీడీపీలో చేరే సందర్భంలో హర్షకుమార్ చంద్రబాబు కాళ్లపై పడడంపై దళిత సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. (హర్షకుమార్ పాదపూజపై.. నెట్టింట ఆగ్రహం) -
జగన్‌పై హత్యాయత్నం చేసింది టీడీపీ వ్యక్తే
కాకినాడ: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డిపై విశాఖ ఎయిర్‌పోర్టులో హత్యాయత్నం చేసిన జనుపల్లి శ్రీనివాసరావు కుటుంబం ముమ్మాటికీ అధికార తెలుగుదేశం పార్టీకి చెందినదేనని మాజీ ఎంపీ జీవీ హర్షకుమార్ స్పష్టం చేశారు. ఇందుకు సంబంధించిన ఆధారాలు, సమాచారం తన వద్ద ఉన్నాయని చెప్పారు. ఆయన తాజాగా మీడియాతో మాట్లాడారు. ఆయన ఏం చెప్పారంటే... ‘‘టీడీపీ మద్దతుతో జనుపల్లి శ్రీనివాసరావు కుటుంబం తమ ప్రాంతంలో రోడ్లు కూడా వేయించుకుంది. మొదటినుంచీ తెలుగుదేశం పార్టీకి మద్దతిస్తున్న వ్యక్తులు ఒక్కసారిగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు పలికారంటే నమ్మలేం. జగన్‌పై హత్యాయత్నం జరిగిన దగ్గర నుంచీ కేసును తప్పుదారి పట్టించే ప్రయత్నమే కనిపించింది. నిందితుడు జనుపల్లి శ్రీనివాసరావు వైఎస్ జగన్, వైఎస్సార్సీపీ అభిమాని అని నమ్మించేందుకే ప్రయత్నించారు. ఈ కేసులో సరైన దిశలో విచారణ జరపడం లేదు. నిందితుడు శ్రీనివాసరావు వైఎస్ జగన్‌తో ఉన్న ఫ్లెక్సీ ఏర్పాటు చేశారని చెబుతున్న నాటి నుంచి ఈ కుట్రకు బీజం పడినట్టుగా భావించాల్సి ఉంటుంది. ముమ్మిడివరంలో టీడీపీ ఎమ్మెల్యే కంటే ఆయన సోదరుడు పృథ్వీరాజ్ చాలా బలవంతుడు. అతడికి విశాఖ ఎయిర్‌పోర్టు క్యాంటీన్ ఓనర్‌తో పరిచయాలున్నాయనే కోణంలో దర్యాప్తు చేయాలి. విమానాశ్రయంలో ఉద్యోగం రావాలంటే అలాంటి కీలకమైన వ్యక్తుల సిఫార్సు ఉంటేనే సాధ్యం. ఉద్యోగానికి అంత సులభంగా ఎన్ఓసీ సంపాదించాడంటే ఎవరో వెనుక ఉన్నట్లు తెలుస్తోంది. జనుపల్లి శ్రీనివాసరావు తరఫున రికమెండ్ చేసి ఉండకపోతే అంత సులభంగా పోలీస్ సర్టిఫికెట్ రావడం సాధ్యం కాదు. ఈ దిశగా అసలు దర్యాప్తు జరిగిన దాఖలాలే కనిపించడం లేదు. టీడీపీకి చెందిన ఎమ్మెల్యే సోదరుడు పృథ్వీరాజ్‌కు, రెస్టారెంట్ యజమాని హర్షవర్థన్ చౌదరికి మధ్య ఉన్న సంబంధం ఏమిటి? అనే కోణంలోనూ దర్యాప్తు జరగాలి. జగన్‌పై జరిగిన హత్యాయత్నంపై సిట్ విచారణ నిందితుడి కాల్‌డేటా చుట్టూ మాత్రమే జరిగింది. కుట్ర కోణాలు, టీడీపీ నేతలతో సంబంధాలు వంటి కీలక కోణాలపై ఏమాత్రం దృష్టి సారించలేదు. -
‘చిన్నకత్తైనా ప్రాణాపాయం.. నేనే ఉదాహరణ’
సాక్షి, రాజమండ్రి : ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌పై జరిగిన దాడి విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఫ్యాక్షనిస్ట్‌లా స్పందించారంటూ మాజీ ఎంపీ జీవీ హర్షకుమార్ మండిపడ్డారు. శుక్రవారమిక్కడ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ప్రతిపక్ష నాయకుడికి సంఘీభావం తెలిపితే చంద్రబాబుకు అంత కడుపుమంట ఎందుకని ప్రశ్నించారు. చిన్నకత్తితో దాడి చేసినా ప్రాణాపాయం ఉంటుందని.. 1996లో తనపై జరిగిన హత్యాయత్నమే అందుకు నిదర్శనమని ఆయన గుర్తు చేశారు. భుజంపై కాకుండా మెడపై దాడి చేసి ఉంటే జగన్‌కు కూడా ప్రాణాపాయం ఏర్పడేదన్నారు. జగన్‌కు దగ్గరయ్యేందుకు తాను ఇలా మాట్లాడటం లేదని వెల్లడించారు. నిందితుడు ఏ పార్టీకి చెందిన వాడనే విషయాన్ని పక్కన పెట్టి దాడి వెనక ఉద్దేశాన్ని బయట పెట్టాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో జరిగే ప్రతి విషయానికి చంద్రబాబు ఎందుకు ఇంతలా భయపడుతున్నారో అర్థం కావడంలేదన్నారు. దళితులపై టీడీపీ నాయకులు చేస్తున్న దాడుల వల్లే గోదావరి జిల్లాలో శాంతిభద్రతల సమస్యలు తలెత్తుతున్నాయని ఆయన ఆరోపించారు. టీడీపీ ప్రభుత్వ చర్యలకు నిరసనగా ఈ నెల 28న ఛలో అమలాపురం ఆందోళన కార్యక్రమానికి పిలుపినిచ్చినట్లు తెలిపారు. -
‘చంద్రబాబుకు కాపులు బుద్ది చెప్పాలి’
విజయవాడ: కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం మచ్చలేని నాయకుడని మాజీ ఎంపీ జీవీ హర్షకుమార్ అన్నారు. ఆదివారం విలేకరులతో మాట్లాడుతూ.. ముద్రగడ కుటుంబాన్ని పోలీసులు చిత్రహింసలకు గురిచేశారని ఆరోపించారు. ముఖ్యమంత్రి చంద్రబాబుకు కాపులు బుద్ది చెప్పాలని కోరారు. కాపులపై అన్యాయంగా పోలీసులు బైండోవర్ కేసులు పెడుతున్నారని ఆరోపించారు. కాపులు ఉభయగోదావరి జిల్లాల్లో సమావేశాలు పెట్టుకొనే అవకాశం లేకుండా చేస్తున్నారని, ఏపీలో భావవ్యక్తీకరణ స్వేచ్ఛను చంద్రబాబు హరిస్తున్నారని ధ్వజమెత్తారు. పోలీసులు సాయంతో చంద్రబాబు పాలన చేస్తున్నారని, మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలనే కాపులు అడుగుతున్నారని గుర్తు చేశారు. -
25న ఆమరణ నిరాహార దీక్ష
రాజమహేంద్రవరం క్రైం: పశ్చిమగోదావరి జిల్లా గరగపర్రు దళితులను సాంఘికంగా బహిష్కరించిన నిందితులను అరెస్ట్ చేయకుంటే ఈనెల 25వ తేదీ నుంచి ఆమరణ నిరాహార దీక్ష తన నివాసంలో చేపడతానని మాజీ ఎంపీ జీవీ హర్షకుమార్ పేర్కొన్నారు. బుధవారం రాజమహేంద్రవరంలోని ఆయన నివాసంలో విలేకరులతో మాట్లాడుతూ గరగపర్రు నిందితులు బెయిల్‌పై విడుదలయ్యారని, సాంఘిక బహిష్కరణ చేసిన వారికి బెయిల్ ఎలా ఇచ్చారని ప్రశ్నించారు. స్థానిక పోలీసులు బెయిల్ లభించే విధంగా కేసులు కట్టారన్నారు. నిందితులకు ఇచ్చిన బెయిల్ రద్దు చేసి అరెస్ట్ చెయ్యాలని డిమాండ్ చేశారు. టీడీపీ, వైఎస్సార్సీపీ నాయకులు ఈ అంశాన్ని పార్లమెంట్లో ప్రస్తావించాలన్నారు. ఈనెల 26న రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్ల ముట్టడి చేపట్టాలని దళితులకు పిలుపునిచ్చారు. కాగా, హర్షకుమార్, ఆయన తనయుడు శ్రీరాజ్‌ను శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తారనే అనుమానంతో త్రీటౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఇద్దరినీ సొంత పూచీకత్తులపై తిరిగి విడుదల చేశారు. -
'ముందు సింగపూర్.. ఇప్పుడు జపాన్'
సాక్షి, రాజమహేంద్రవరం: ‘రాజధాని పేరుతో అరచేతిలో స్వర్గం చూపిస్తున్నారు...మీ పాలన రాజధానికే పరిమితమా? రాజధాని నిర్మాణంలో ఏ లొసుగులున్నాయో తెలియటంలేదు... ముందు సింగపూర్ అన్నారు... ఇప్పుడు జపాన్ అంటున్నారు’ అని మాజీ ఎంపీ హర్షకుమార్ సీఎం చంద్రబాబుపై ధ్వజమెత్తారు. ఈ మేరకు ఆయన గురువారం చంద్రబాబుకు లేఖ రాశారు. విదేశీ టూర్ల పేరుతో ప్రజాధానాన్ని వృథా చేస్తున్నారని మండిపడ్డారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన రైతు, డ్వాక్రా రుణమాఫీ, ఇంటికో ఉద్యోగం, నిరుద్యోగ భృతి వంటి హామీలను విస్మరించారని ఆ లేఖలో విమర్శించారు. ఎస్సీ,ఎస్టీ కార్పొరేషన్‌కు నిధులు కేటాయించకుండా పథకాలకు చంద్రన్న అంటూ పేరు పేట్టుకోవడం సిగ్గుచేటన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా తన బినామీలకు బాబు అక్రమంగా భూములు కేటాయిస్తున్నారని ఆరోపించారు. కార్పొరేట్ విద్యా సంస్థలు, కాలేజీల నుంచి ముడుపులు తీసుకుంటూ విద్యా హక్కు చట్టాన్ని నిర్వీర్యం చేస్తున్నారని విమర్శించారు. -
'టీడీపీ హయాంలో దళితులపై దాడులు పెరిగాయి'
రాజమండ్రి : టీడీపీ ప్రభుత్వంపై మాజీ ఎంపీ జి.వి.హర్షకుమార్ మంగళవారం రాజమండ్రిలో నిప్పులు చెరిగారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత దళితులపై దాడులు పెరిగాయని ఆయన ఆరోపించారు. రాజానగరం మండలం పాతతుంగపాడు గ్రామంలో అన్యాయం జరిగిన దళిత కుటుంబానికి న్యాయం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. నిందితులతో పరిహారం ఇప్పించినా అధికారులను వెంటనే సస్పెండ్ చేయాలని టీడీపీ ప్రభుత్వానికి హర్షకుమార్ విజ్ఞప్తి చేశారు. -
'చంద్రబాబు ఎస్సీ, ఎస్టీలను మోసగిస్తున్నారు'
అమలాపురం: ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ నిధులను ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి ప్రభుత్వం చట్టంలో నిర్దేశించిన విధంగా ఖర్చు చేయకుండా దళితులను మోసగిస్తోందని అమలాపురం మాజీ ఎంపీ జీవీ హర్షకుమార్ ఆరోపించారు. అమలాపురంలో కోనసీమ దళిత నాయకులు, యువకులతో గురువారం నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో ఆయన మాట్లాడారు. సబ్‌ప్లాన్ నిధులను ఇతర అవసరాలకు మళ్లించి దళిత, గిరిజన వాడల్లో అభివద్ధి జాడలు లేకుండా చేస్తున్నారని అన్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ కింద తొలి బడ్జెట్లో రూ.8 వేలకోట్లు, రెండో బడ్జెట్లో రూ.6 వేలకోట్లు కేటాయించారని చెప్పారు. ఈ నిధులను వేరే అవసరాలకు మళ్లించి దళిత ప్రాంతాల అభివద్ధిని చంద్రబాబు పూర్తిగా తుంగలో తొక్కారని ధ్వజమెత్తారు. గత రెండు బడ్జెట్లో కేటాయించిన సబ్‌ప్లాన్ నిధుల ఖర్చులు, ప్రణాళికపై ప్రభుత్వం తక్షణమే శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. గత కాంగ్రెస్ ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీల సామాజికాభివృద్ధికి సబ్‌ప్లాన్ విధానం ప్రవేశపెట్టి దానిని చట్టం కూడా చేసిందని గుర్తు చేశారు. దేశంలో ఇలాంటి చట్టం ఏ రాష్ట్రంలోనూ లేదన్నారు. సబ్‌ప్లాన్ విషయంలో ఎస్సీ, ఎస్టీలకు జరుగుతున్న అన్యాయాన్ని నిరసిస్తూ ఈ నెల 15న అమలాపురంలో మహాధర్నా నిర్వహిస్తున్నట్లు హర్షకుమార్ ప్రకటించారు. ఆలోగా రాష్ట్ర ప్రభుత్వం సబ్‌ప్లాన్ నిధుల వినియోగంపై శ్వేతపత్రం ప్రకటించాలని, లేకుంటే ఉద్యమిస్తామని హెచ్చరించారు. -
'ఆ 29మంది మృతికి చంద్రబాబే కారణం'
మాజీ ఎంపీ జీవీ హర్షకుమార్ రాజమండ్రి: పుష్కరాల తొలిరోజు ఘాట్ వద్ద జరిగిన తొక్కిసలాటలో 29 మృతికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడే కారణమని అమలాపురం మాజీ ఎంపీ జీవీ హర్షకుమార్ ఆరోపించారు. క్రైస్తవ శ్మశానవాటిక కోసం చేపట్టిన దీక్షను పోలీసులు భగ్నం చేయడానికి వచ్చిన సందర్భంగా రివాల్వర్‌తో గాల్లోకి కాల్పులు జరిపిన కేసులో అరెస్టయిన ఆయన బెయిల్‌పై రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి బుధవారం విడుదలయ్యారు. ఈ సందర్భంగా హర్షకుమార్ మాట్లాడుతూ.. ఘాట్ వద్ద షార్ట్ ఫిల్మ్ తీయడం కారణంగానే తొక్కిసలాట జరిగిందని, అందుకు చంద్రబాబు దోషిగా నిలబడాలని పేర్కొన్నారు. ఓటుకు కోటు ముడుపుల కేసులో అడ్డంగా దొరికిపోయిన చంద్రబాబుకు రాష్ట్రాన్ని పాలించే అర్హత లేకున్నా.. సిగ్గు లేకుండా సీఎంగా కొనసాగుతున్నారని విమర్శించారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన ఆరోగ్య శ్రీ పథకాన్ని ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ అని, మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి ప్రవేశపెట్టిన బంగారు తల్లి పథకాన్ని, మా ఇంటి మహలక్ష్మి అని పేర్లు మార్చి వీటిని తానే ప్రవేశపెట్టినట్లు ప్రచారం చేసుకోవడం సిగ్గు చేటన్నారు. పది రోజుల్లోగా క్రైస్తవుల శ్మశాన వాటికకు భూములు కేటాయించకపోతే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు. -
మాజీ ఎంపీ హర్షకుమార్కు ఆరు నెలల జైలు
రాజమండ్రి లీగల్: విధి నిర్వహణలో ఉన్న పోలీసు అధికారిపై దౌర్జన్యం చేసిన కేసులో అమలాపురం మాజీ ఎంపీ జీవీ హర్షకుమార్కు ఆరు నెలల జైలుశిక్ష, రూ.1000 జరిమానా విధిస్తూ రాజమండ్రి మూడో అదనపు ఫస్ట్‌క్లాస్ మేజిస్ట్రేట్ ఆర్. కిశోర్‌బాబు గురువారం తీర్పు చెప్పారు. ప్రాసిక్యూషన్ కథనం ప్రకారం 2007 ఫిబ్రవరి 25న రాజమండ్రి మూడో పట్టణ పోలీస్‌స్టేషన్ పరిధిలో మాలమహానాడు అధ్యక్షులు కారెం శివాజీ ఆమరణ నిరాహారదీక్ష చేస్తున్నందున 144 సెక్షన్ విధించారు. రాత్రి 10 గంటల సమయంలో కొందరు వ్యక్తులు గుమిగూడి ఉండగా పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు. విషయం తెలుసుకున్న అప్పటి ఎంపీ హర్షకుమార్ పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి డ్యూటీలో ఉన్న ఏఎస్ఐ సత్యనారాయణపై దౌర్జన్యంగా ప్రవర్తించి, అదుపులో ఉన్న వ్యక్తులను తీసుకుపోయూరు. ఏఎస్ఐ ఫిర్యాదుతో ఎస్ఐ జి. మురళీకృష్ణ కేసు నమోదు చేశారు. విచారణ అనంతరం నేరం రుజువు కావడంతో మేజిస్ట్రేట్ పై శిక్షను విధించారు. అనంతరం హర్షకుమార్‌ను అరెస్టు చేయగా బెయిల్‌పై విడుదలయ్యూరు. కాగా జిల్లా కోర్టుకు అప్పీలు చేసుకునేందుకు 30 రోజులు గడువిచ్చారు. -
టీడీపీ, బీజేపీలు ప్రమాదకరం
అమలాపురం టౌన్, న్యూస్‌లైన్ : రాష్ట్రాన్ని రెండు ముక్కలు చేసిన కాంగ్రెస్ పార్టీ కంటే అందుకు తెరవెనుక సహకరించిన బీజేపీ, టీడీపీలే ప్రమాదకరం... అంతటితో ఆగకుండా ప్రస్తుత సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ, టీడీపీల మధ్య పొత్తు మరింత ప్రమాదకరమని జై సమైక్యాంధ్ర పార్టీ ఉపాధ్యక్షులు, ఎంపీలు ఉండవల్లి అరుణ్‌కుమార్, జి.వి.హర్షకుమార్లు అన్నారు. అమలాపురంలోని నల్లవంతెన సమీపంలో జై సమైక్యాంధ్ర పార్టీ కార్యాలయాన్ని ఎంపీలు ఇద్దరూ గురువారం సాయంత్రం ప్రారంభించారు. అనంతరం ఆ కార్యాలయ ఆవరణలో జరిగిన సభలో వారు మాట్లాడారు. సీమాంధ్ర ఎంపీలు, ఎమ్మెల్యేల మెజార్టీ వాదనను పరిగణలోకి తీసుకోకుండా కేవలం టీఆర్ఎస్ గొంతెమ్మ కోర్కెలకు కాంగ్రెస్ సాగిలబడి రాష్ట్రాన్ని ముక్కలు చేసిందని ఎంపీలు అన్నారు. అందుకు బీజేపీ పార్లమెంటులో సహకరిస్తే... రాష్ట్రంలో చంద్రబాబునాయుడు విభజనకు అనుకూలంగా లేఖ ఇచ్చారన్నారు. అటు బీజేపీ, ఇటు టీడీపీ రాష్ట్ర విభజనలో భాగస్వాములయ్యాయని ధ్వజమెత్తారు. ఈ రెండు పార్టీలు ఇప్పుడు తగుదునమ్మా అంటూ పొత్తులు పెట్టుకుని ఉమ్మడిగా ఓట్లడగడం విడ్డూరంగా ఉందన్నారు. ఈ పొత్తుతో టీడీపీ అధికారంలోకి వస్తే సీమాంధ్రకు మరింత ప్రమాదమని ఎంపీ హర్షకుమార్ పేర్కొన్నారు. రాజ్యాంగ విరుద్ధంగా జరిగిన రాష్ట్ర విభజన అంశాన్ని సుప్రీంకోర్టులో విచారణకు స్వీకరించిన ధర్మాసనం ఆంధ్రప్రజల మనోభావాలకు అనుగుణంగానే తీర్పు ఇస్తుందని ఎంపీలు ఆశాభావం వ్యక్తం చేశారు. విభజన తీరును అత్యున్నత న్యాయస్థానం తప్పుపట్టవచ్చని వారు అభిప్రాయపడ్డారు. ఎంపీలు ఇద్దరూ తమ తమ ప్రసంగాల్లో మాజీ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి జై సమైక్యాంధ్ర పార్టీ ఏ పరిస్థితుల్లో పెట్టాల్సి వచ్చిందో... మేమంతా ఆయన వెనుక ఎందుకు వెళ్లాల్సి వచ్చిందో సభకు వివరించే ప్రయత్నం చేశారు. సమైక్యాంధ్ర ఉద్యమంలో పాల్గొన్న ఎంతోమంది తమ పార్టీ వెనుక వస్తారనుకున్నామని... తమ దిష్టిబొమ్మలు తగలేసినా తాము సమైక్యాంధ్ర కోసమే పాటుపడ్డామని చెబుతూ వారంతా ఇప్పుడేమయ్యారని సభలో ఎంపీలు ప్రశ్నించారు. అంతకుముందు వారు పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. సభావేదికపై అమలాపురం, పి.గన్నవరం, ముమ్మిడివరం నియోజకవర్గాల పార్టీ ఇన్‌చార్జ్‌లుగా నెల్లి కిరణ్‌కుమార్, జి.వి.శ్రీరాజ్, స్వామినాయక్‌లను పరిచయం చేస్తూ వారే అభ్యర్థులని ప్రకటించారు. అమలాపురం నియోజకవర్గ పార్టీ ఇన్చార్జ్ నెల్లి కిరణ్‌కుమార్ అధ్యక్షతన జరిగిన ఈ సభలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అల్లు బాబి, రాజమండ్రి సమైక్యాంధ్ర పార్టీ నాయకుడు చెరుకూరి రామారావు పాల్గొన్నారు. -
సొంత గూటికి వెళ్లిపోతారా?
మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ఏ ముహుర్తానా పార్టీ పెట్టారోగానీ ఆయన తప్ప అందులో ఎవరూ మిగిలేట్టు కనబడడంలేదు. చివరి బంతి వేసి విభజనకు విష్ణుచక్రం అడ్డువేస్తానని బీరాలు పలికి తుస్సుమనిపించిన నల్లారివారు నిదానంగా సీఎం సీటు దిగిపోయి జై సమైక్యాంధ్ర అంటూ సొంత దుకాణం తెరిచారు. తనతో పాటు అధికారం దర్పం వెలగబట్టిన వారంతా తనవెంట వచ్చేస్తారని ఆశించారు. ఆరంభంలోనే కథ అడ్డం తిరిగింది. ఆయన పార్టీ పెట్టక ముందే మంత్రులు జారుకున్నారు. మరికొందరు పార్టీ పెట్టాక గోడ దూకేశారు. పార్టీ పదవుల్లో ఉండగానే ఫిరాయించడంతో కిరణ్ అవాక్కయ్యారు. ఇప్పుడు ఆయన వెంట ఉన్న ఎంపీలు కూడా హస్తం గూటికి చేరే అవకాశం కన్పిస్తోంది. పార్టీలోకి తిరిగి రావాలని అమలాపురం ఎంపీ జీవీ హర్షకుమార్కు రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి దిగ్విజయ్ సింగ్ ఆహ్వానం పలికారు. అంతేకాదు ఆయనపై విధించిన బహిష్కరణ కూడా ఎత్తేస్తామని హామీయిచ్చారు. జేడీ శీలం, పనబాక లక్ష్మి, బాలరాజు, రఘువీరారెడ్డితో కూడా హర్షకుమార్‌తో మాట్లాడించారు. హర్షకుమార్‌తో పాటు మిగతా ఎంపీలను తిరిగి పార్టీలోకి రప్పించేందుకు కాంగ్రెస్ పెద్దలు గట్టిగానే ప్రయత్నిస్తున్నట్టు ఊహాగానాలు విన్పిస్తున్నాయి. కిరణ్ వెంట ఉన్న కాంగ్రెస్ ఎంపీలు మళ్లీ సొంతగూటికి వెళ్లేందుకు సుముఖంగానే ఉన్నట్టు కనబడుతోంది. కిరణ్ కూడా తన పార్టీని కాంగ్రెస్‌లో కలిపేసినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదంటున్నారు విశ్లేషకులు. -
'మల్కాజ్గిరి నుంచి ఉండవల్లి పోటీ'
రాజమండ్రి: జై సమైక్యాంధ్ర పార్టీ తరఫున మల్కాజ్గిరి నుంచి ఉండవల్లి అరుణ్ కుమార్‌ను పోటీకి దింపుతామని అమలాపురం ఎంపీ జీవీ హర్షకుమార్ తెలిపారు. అమలాపురం నుంచే తాను పోటీ చేస్తానని చెప్పారు. అమలాపురం పార్లమెంట్ నియోజకవర్గంలోని ఏడు అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులు ఖరారు చేసినట్టు వెల్లడించారు. జై సమైక్యాంధ్ర పార్టీ తెలంగాణలోనూ పోటీ చేస్తుందని ఆ పార్టీ వ్యవస్థాపకుడు, మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఇంతకుముందే ప్రకటించారు. మల్కాజ్ గిరిలో అధిక సంఖ్యలో ఉన్న సీమాంధ్ర ఓట్లు ఉండడంతో ఇక్కడి నుంచి తమ పార్టీ అభ్యర్థిని రంగంలోకి దింపాలని జై సమైక్యాంధ్ర పార్టీ నిర్ణయించింది. మల్కాజ్ గిరిలో పోటీకి ఉండవల్లి కూడా సుముఖంగా ఉన్నట్టు తెలుస్తోంది. -
'విభజనను అడ్డుకోవడంలో వెనుకబడ్డాం'
హైదరాబాద్: రాష్ట్ర విభజన విషయంలో కేంద్రం ఏకపక్షంగా వ్యవహరిస్తోందని అమలాపురం కాంగ్రెస్ ఎంపీ జివి హర్షకుమార్ అన్నారు. కేంద్రం మొండివైఖరి వ్యవహరిస్తోందని విమర్శించారు. తమమెవరితో సంప్రదించకుండా కాంగ్రెస్ నిర్ణయం తీసుకుందని వెల్లడించారు. విభజనకు అనుకూలంగా సీడబ్ల్యూసీ నిర్ణయం తమకెవరికీ తెలియదని చెప్పారు. కనీసం సీఎం కూడా చెప్పకుండా నిర్ణయం తీసుకుందని వాపోయారు. ఆంటోనీ కమిటీతో ఒరిగింది ఏమీ లేదన్నారు. హైదరాబాద్, నదీ జలాలపై తమ అభిప్రాయాలను కేంద్రం పరిగణనలోకి తీసుకోలేదన్నారు. విభజనను అడ్డుకోవడంలో తాము వెనుకబడ్డామని చెప్పారు. తమ రాజీనామాలపై ప్రజల్లో అపోహలున్నాయని చెప్పారు. యూపీఏ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానంతో విభజనను అడ్డుకుంటామన్న విశ్వాసాన్ని హర్షకుమార్ వ్యక్తం చేశారు -
ఎంపీ హర్షకుమార్ అనుచరుల దౌర్జన్యం
కపిలేశ్వరపురం: అమలాపురం ఎంపీ జీవీ హర్షకుమార్ అనుచరులు వీరంగమాడారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడిపై దాడికి పాల్పడ్డారు. తూర్పుగోదావరి జిల్లా కపిలేశ్వరపురం రచ్చబండలో కార్యక్రమం సందర్భంగా హర్షకుమార్ అనుచరులు పెట్రేగిపోయారు. ఇసుక మాఫియా ఆగడాల గురించి నిలదీసిన వైఎస్సార్ సీపీ నాయకుడు రెడ్డి ప్రసాద్‌పై హర్షకుమార్ అనుచరుల దౌర్జన్యానికి పాల్పడ్డారు. ఈ ఘటనలో ప్రసాద్‌కు గాయాలయ్యాయి. గతనెలలో సమైక్యవాదులపై హర్షకుమార్ తనయులు శ్రీరాజ్, సుందర్ కర్రలతో దాడికి పాల్పడిన సంగతి తెలిసిందే.