మాజీ ఎంపీ హర్షకుమార్
సాక్షి, రాజమండ్రి : ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌పై జరిగిన దాడి విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఫ్యాక్షనిస్ట్‌లా స్పందించారంటూ మాజీ ఎంపీ జీవీ హర్షకుమార్ మండిపడ్డారు. శుక్రవారమిక్కడ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ప్రతిపక్ష నాయకుడికి సంఘీభావం తెలిపితే చంద్రబాబుకు అంత కడుపుమంట ఎందుకని ప్రశ్నించారు. చిన్నకత్తితో దాడి చేసినా ప్రాణాపాయం ఉంటుందని.. 1996లో తనపై జరిగిన హత్యాయత్నమే అందుకు నిదర్శనమని ఆయన గుర్తు చేశారు. భుజంపై కాకుండా మెడపై దాడి చేసి ఉంటే జగన్‌కు కూడా ప్రాణాపాయం ఏర్పడేదన్నారు.
జగన్‌కు దగ్గరయ్యేందుకు తాను ఇలా మాట్లాడటం లేదని వెల్లడించారు. నిందితుడు ఏ పార్టీకి చెందిన వాడనే విషయాన్ని పక్కన పెట్టి దాడి వెనక ఉద్దేశాన్ని బయట పెట్టాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో జరిగే ప్రతి విషయానికి చంద్రబాబు ఎందుకు ఇంతలా భయపడుతున్నారో అర్థం కావడంలేదన్నారు. దళితులపై టీడీపీ నాయకులు చేస్తున్న దాడుల వల్లే గోదావరి జిల్లాలో శాంతిభద్రతల సమస్యలు తలెత్తుతున్నాయని ఆయన ఆరోపించారు. టీడీపీ ప్రభుత్వ చర్యలకు నిరసనగా ఈ నెల 28న ఛలో అమలాపురం ఆందోళన కార్యక్రమానికి పిలుపినిచ్చినట్లు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment