'విభజనను అడ్డుకోవడంలో వెనుకబడ్డాం'
హైదరాబాద్: రాష్ట్ర విభజన విషయంలో కేంద్రం ఏకపక్షంగా వ్యవహరిస్తోందని అమలాపురం కాంగ్రెస్ ఎంపీ జివి హర్షకుమార్ అన్నారు. కేంద్రం మొండివైఖరి వ్యవహరిస్తోందని విమర్శించారు. తమమెవరితో సంప్రదించకుండా కాంగ్రెస్ నిర్ణయం తీసుకుందని వెల్లడించారు. విభజనకు అనుకూలంగా సీడబ్ల్యూసీ నిర్ణయం తమకెవరికీ తెలియదని చెప్పారు. కనీసం సీఎం కూడా చెప్పకుండా నిర్ణయం తీసుకుందని వాపోయారు.
ఆంటోనీ కమిటీతో ఒరిగింది ఏమీ లేదన్నారు. హైదరాబాద్, నదీ జలాలపై తమ అభిప్రాయాలను కేంద్రం పరిగణనలోకి తీసుకోలేదన్నారు. విభజనను అడ్డుకోవడంలో తాము వెనుకబడ్డామని చెప్పారు. తమ రాజీనామాలపై ప్రజల్లో అపోహలున్నాయని చెప్పారు. యూపీఏ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానంతో విభజనను అడ్డుకుంటామన్న విశ్వాసాన్ని హర్షకుమార్ వ్యక్తం చేశారు