ఒక్కటైన ‍ప్రేమజంట | love marriage in korthikota | Sakshi
Sakshi News home page

ఒక్కటైన ‍ప్రేమజంట

Jun 7 2017 10:54 PM | Updated on Sep 5 2017 1:03 PM

ఒక్కటైన ‍ప్రేమజంట

ఒక్కటైన ‍ప్రేమజంట

అనంతపురం జిల్లా తనకల్లు మండలం కొర్తికోటకు చెందిన మణిమాల, కర్నూలు జిల్లా నంద్యాల మండలం ఎర్రగుంట్లకు చెందిన ప్రసన్నకుమార్‌ ప్రేమకథ సుఖాంతమైంది.

తనకల్లు (కదిరి) : అనంతపురం జిల్లా తనకల్లు మండలం కొర్తికోటకు చెందిన మణిమాల, కర్నూలు జిల్లా నంద్యాల మండలం ఎర్రగుంట్లకు చెందిన ప్రసన్నకుమార్‌ ప్రేమకథ సుఖాంతమైంది. వీరిద్దరూ కలసి ప్రకాశం జిల్లా మార్కాపురంలో నాలుగేళ్ల కిందట ఇంజినీరింగ్‌ చదివేవారు. ఆ సమయంలో ఏర్పడిన పరిచయం ప్రేమకు దారి తీసింది. చదువు పూర్తయ్యాక తమ ప్రేమ విషయం రెండు కుటుంబాల పెద్దలకు తెలిపారు. పెళ్లి చేసి ఆశీర్వదించాలని కోరారు. కులాలు వేరైనా అబ్బాయి తరఫు వారు సుముఖత చూపగా, అమ్మాయి తల్లిదండ్రులు అభ్యంతరం తెలిపారు. ఇద్దరూ మేజర్లు కావడంతో తనకల్లు మండలం తవళం ఆంజనేయస్వామి దేవస్థానంలో వారిద్దరూ దండలు మార్చుకొని బుధవారం ఒక్కటయ్యారు. వధూవరులను ఆలయ ట్రస్టు బోర్డు చైర్మన్‌ రమణ, ఇతర పెద్ద మనుషులు ఆశీర్వదించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement